ఇలాంటి వాటిని చూస్తే దేవుడు ఉన్నాడని నమ్మాల్సిందే.. ఫోటో వైరల్..

-

ఇందులేడు.. అందులేడు.. విశ్వామంతా శివమయం.. పరమశివుడి ఆజ్ఞలేనిదే చీమ కూడా కుట్టదు..ప్రాణం పోసేది ఆ బ్రహ్మ అయితే, ప్రాణాలను తీసేది శివయ్య.. అందుకే ఆయన అనుగ్రహం కోసం భక్తులు నిత్యం శివనామ స్మరణ చేస్తారు. మనదేశంలో అత్యధికంగా పూజించే దేవుడు శివుడు.. ఇంకా చెప్పలంటే.. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఆయన భక్తులు నిండుగా ఉన్నారు.ప్రతి గ్రామంలో శివుని గుడి ఉంటుంది. శివుని గురించి తెలిసిన వారికి నంది గురించి కూడా తెలుస్తుంది.

 

నిజానికి .. ఎద్దు అంటే.. నందిని శివుని వాహనంగా భావిస్తారు. కొంతమంది నందిని శివయ్యకు ద్వారపాలకుడిగా కూడా భావిస్తారు. ప్రస్తుతం ఒక ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ‘నంది’ అని పిలిచినా తప్పుకాదని అంటున్నారు శివయ్య భక్తులు..వైరల్ అవుతున్న వీడియోలో ఆ బసవన్న నిజంగా భక్తుడిలా చేసి అందరిని ఆశ్చర్యానికి గురించేస్తుంది.. యూపీలోని ఓ చిన్న శివాలయానికి రోజూ అదే సమయానికి వచ్చి..ఈ ఎద్దు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది..

అంతేకాదు.. ప్రతి రోజూ తక్కువ కాకుండా ఖచ్చితంగా 108 ప్రదక్షిణలు చేస్తుందట. ఎద్దు చేసే ప్రదక్షణలో ఒకటి ఎక్కువ లేదా ఒకటి తక్కువ కాదు. తన ప్రదక్షణలు లెక్కలు వేసుకుంటూ తిరుగుతున్నట్లు అనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు.గుడి చుట్టూ ఎద్దు ఎలా తిరుగుతుందో వీడియోలో చూడొచ్చు. ఈ సమయంలో, మహిళలు కూడా ఆలయం లోపల శివుడిని పూజిస్తున్నారు. ఎవరిని పట్టించుకోకుండా.. తనకు ఎవరితోనూ పనిలేదు అన్నట్లు.. భక్తి పారావశ్యంలో మునిగి ప్రదక్షణలు చేస్తుంది.. ఎలా చేస్తుందో ఈ వీడియో లో ఒకసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version