టీలో షుగర్‌ పక్కనపెట్టి ఉప్పు వేయండి.. ఎన్నో లాభాలు..!!

-

టీ: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా అని అడగటం మీర చూసి ఉంటారు.. కానీ మీ టీలో ఉప్పుందా..? అసలు మీరు ఎప్పుడైనా టీలో ఉప్పు వేసుకుని తాగారా..?ఛీ ఛీ బుద్ధి ఉన్నవాళ్లు అలా తాగుతారా అని అనుకుంటున్నారా..? మనం ఎవర్ని అయినా ఏడిపించడానికి వాళ్లు తాగే టీ లేదా కాఫీల్లో అప్పుడప్పుడు ఉప్పు వేసి ఇచ్చి ఉంటాం.. కానీ టీలో ఉప్పు వేసుకుని తాగితే బోలెడు ప్రయోజనాలు అంటున్నారు వైద్యనిపుణులు.. నమ్మబుద్ధి కావడం లేదా..? అయితే మీరు చూడండి..!

మధుమేహం ఉన్నవారు చక్కెర లేకుండా చప్పగా తాగుతారు. కానీ మీరు ఎప్పుడైనా సాల్ట్ టీని ప్రయత్నించారా? అసలు టీలో ఉప్పు కలిపి తీసుకోవచ్చని మీకు తెలుసా? కానీ టీలో చక్కెరకు బదులు చిటికెడు ఉప్పు కలుపుకొని తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయట. అయితే సాధారణ ఉప్పుకు బదులు బ్లాక్ సాల్ట్ లేదా హిమాలయన్ ఉప్పు కలిపి తాగితే మంచిదని చెబుతున్నారు.

సాల్ట్ టీ చేయడానికి, మీరు చేయాల్సిందల్లా ముందుగా టీ ఆకులను లేదా టీ పొడిని నీటిలో వేసి మరిగించండి, మరిగిన డికాక్షన్‌ను కప్పులో పోసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని తాగటమే. మీరు పాలు కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు. డికాక్షన్‌లో పాలు కలిపిన తర్వాత చిటికెడు ఉప్పువేసి కలుపుకొని తాగాలి. సాల్ట్ టీలో చక్కెర వేయకూడదు.

సాల్ట్‌ టీ తాగడం వల్ల ప్రయోజనాలు..

ఉప్పు టీ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
ఉప్పు టీ గొంతు నొప్పిని కూడా నయం చేస్తుంది, సీజనల్ వ్యాధులను దూరం చేస్తుంది.
ఉప్పు కలిపి తాగటం వల్ల శరీరంలో శక్తితో పాటు సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
మీ జీర్ణవ్యవస్థను నియంత్రణలో ఉంచడం, జీవక్రియను మెరుగుపరుస్తుంది.
హిమాలయన్ సాల్ట్‌లో ఉండే జింక్ దెబ్బతిన్న కణజాలాలను రిపేర్ చేయడంలో, మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇందులోని సల్ఫర్ మూలకం చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఉప్పు టీ మైగ్రేన్ సమస్యలను నయం చేస్తుంది.
మనస్సుతో పాటు శరీరాన్ని కూడా రిలాక్స్ చేస్తుంది.
అంతేకాకుండా, ఇది ఒత్తిడి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
మెరుగైన ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.
సాల్ట్ టీ మిమ్మల్ని ఎక్కువ కాలం హైడ్రేట్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
గ్రీన్ టీలో బ్లాక్ సాల్ట్ కలిపి తాగడం వల్ల అజీర్ణం, అసిడిటీ, అజీర్ణం వంటి కడుపు సమస్యలను తగ్గించుకోవచ్చు.

లెమన్ టీలో బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగితే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. ఈ టీ కడుపు జీవక్రియ రేటును పెంచుతుంది, ప్రేగు కదలికను వేగవంతం చేస్తుంది.
ఈ టీ మీ కడుపుని క్లియర్ చేస్తుంది, శరీరం డిటాక్స్ చేస్తుంది.
బ్లాక్ టీలో బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి తాగటం వలన బరువు త్వరగా తగ్గొచ్చు.. ఇది కడుపులో జీర్ణ ఎంజైమ్‌లను ప్రోత్సహిస్తుంది. కొవ్వు తగ్గుతుంది, ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

అయితే రోజుకు ఒక్కసారి మాత్రమే ఇలా తాగాలి.. మంచిది కదా అని అదే పనిగా తాగితే.. విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version