సాయి పల్లవి మేకప్ వేసుకోకపోవడానికి కారణం అదేనా..?

-

టాలీవుడ్లో న్యాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ సాయి పల్లవి.. ఇక ఈమె అందం గురించి డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది. మొదట టాలీవుడ్ లోకి ఫిదా సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది. స్టార్ హీరోల సినిమాలైనప్పటికీ తన పాత్రకు స్కోప్ లేకపోతే నిర్మొహమాటంగా నటించానని తెలియజేస్తూ ఉంటుంది.

ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరీ నటిస్తూ తన పాత్రకు న్యాయం చేస్తూ శభాష్ అనిపించుకుంటుంది సాయి పల్లవి. తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తిరిగి మళ్ళీ ఇప్పుడు సినిమాలలో నటిస్తోంది. సాయి పల్లవి మేకప్ కు దూరంగా ఉంటూ వస్తుంది. అయితే ఈమె అలా ఉండడానికి గల ముఖ్య కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారుతోంది.

సాయి పల్లవికి కూడా చర్మ సమస్యలతో బాధపడుతోందని, మేకప్ ఉత్పత్తులు వాడితే ఆమె చర్మం కూడా ఇబ్బందులు పడుతుందని.. దీంతో ఆమె చర్మం పై ర్యాషేస్, తీవ్రమైన దురద వంటి సమస్యలు కూడా వస్తాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అందుచేతనే సాయి పల్లవి మొదటి నుంచి సినిమాలకు మేకప్ వేసుకోకుండా దూరంగా ఉంటోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దర్శక నిర్మాతలకు కూడా ఈ కండిషన్ మీదే తను సినిమాలకు సైన్ చేస్తోందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version