అడాల్ఫ్ హిట్లర్” అతని గురించి వింటే ఒకప్పుడు ప్రపంచం మొత్తం వణికిపోయేది. అతని క్రూరత్వం గురించి ప్రపంచానికి పెద్దగా పరిచయం కూడా చెయ్యాల్సిన పని లేదు, సామాజిక మాధ్యామాలు ప్రచారాలు ఏమీ లేకుండానే హిట్లర్ ఎంత భయంకరమైన వ్యక్తి అనేది అప్పట్లోనే నోటి మాట ద్వారా ప్రపంచం తెలుసుకుంది. అలాంటి వ్యక్తి ఒక గొప్ప ప్రేమికుడు అంటుంది చరిత్ర… తన భార్యను తను ఎంత ప్రేమిస్తాడో చరిత్ర చెప్తుంది. హిట్లర్ కంటే ఇవా బ్రువాన్ 23 ఏళ్ల చిన్నది అయిన ఆమె… హిట్లర్ ని ఎంతగానో ప్రేమించింది.
ఇవా 17ఏళ్ల వయసున్నప్పుడు హిట్లర్ ని ఆమె కలవగా అప్పుడు హిట్లర్ వయసు 40 ఏళ్ళు. ఆమె ఫొటోగ్రఫీ అసిస్టెంట్‌గా పనిచేసేది. మొదటిచూపులోనే ప్రేమలో పడిపోయింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పింది. అందుకు ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదు. కాని ఆమె మాత్రం పట్టు వీడలేదు. తాను ఎంతగానో ప్రేమించే హిట్లర్ ని వివాహం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఆయన కోసం 16 ఏళ్ళు ఎదురు చూసింది. ఆ తర్వాత తర్వాత హిట్లర్ ఆమెను ఇష్టపడ్డాడు. ఆమెఉ తనకు కాళీ దొరికిన సమయంలో ఎంతగానో ప్రేమించేవాడు. అయితే ఆమెకు కొన్ని షరతులు విదించెవాడు.
ఆమె చుట్టూ ఎప్పుడు కొంత మంది యువకులను నియమించే వాడు. ఆమె మద్యం తాగడం, ఇతరులతో మాట్లాడటం, వినోదాలకు అలవాటు పడటం వంటివి హిట్లర్ కి నచ్చేవి కాదట. ముందు ఆమెను యూదు కుటుంబానికి చెందిన వ్యక్తి అని భావించిన హిట్ల విచారణ చేసి ఆమె ఆర్యులు అని తెలుసుకున్న తర్వాత వివాహం చేసుకున్నాడు. అది కూడా ఆయన చివరి రోజుల్లో ఆత్మహత్య చేసుకునే ముందు ఆమెను పెళ్లి చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన తన డైరీలో కూడా ప్రస్తావించారు. అలాగే తాము ఇద్దరినీ ఎక్కడ ఖననం చెయ్యాలో కూడా వీలునామాలో రాసి చనిపోయాడు హిట్లర్. జంట ఏప్రిల్ 29, 1945 న ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.