లాక్ డౌన్ లో ప్రేమికుల కష్టాలు ఇంతింత కాదయా !

-

లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఒకానొక టైములో ఆఫీసులకు కాలేజీలకు ఎవరికి వారు తమ పనులకు బయటకు వెళ్లి ఉన్న జీవితం ఒక్కసారిగా నాలుగు గోడల మధ్య ఉండిపోవడంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా రకరకాల ప్రజలు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేదవాళ్లు తమ కడుపు నింపుకోవడం కోసం ఆకలి కేకలు పెడుతుంటే మరోపక్క విద్యార్థులు తమ నెక్స్ట్ అకాడమీ సంవత్సరం ఏమవుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు.Lockdown impact on economy and market: How will India lockdown ...ఇలాంటి కీలక టైం లో ప్రేమికుల కష్టాలు కూడా ఇంతింత కాదయా అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ విధించక ముందు ప్రేమికులు బయట కలుసుకోవడానికి టైం ఉండేది… పరిస్థితులు కూడా సహకరించేవి. అలా బయటకు వెళ్లి కాలేజీ లో అయినా, పనిచేసే చోట అయినా, పార్కులో అయినా ఎక్కడో అక్కడ కలుసుకోవడం జరిగేది. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎవరికి వాళ్లు ఇళ్ళల్లో ఉండటంతో  వీళ్లంద‌రికీ ఇప్పుడు అవ‌కాశాలు లేకుండా పోయాయి.

 

ఒకరిని ఒకరు డైరెక్టుగా చూసుకుని నెల రోజులు గ‌డిపేస్తున్న వాళ్లూ చాలా మందే ఉన్నారు. టెక్నాలజీ ఉండటంతో వీడియో చాటింగులు ఈజీనే కాబ‌ట్టి కాస్త ఎడ‌బాటు, విర‌హ వేద‌న తీరుతున్న‌ డైరెక్టుగా కలవటానికి అనేక అవస్థలు పడుతున్నారు. దూరంగా ఎడంగా ఉంటూ చాలా రోజులు గడిచిపోతున్న తరుణంలో చాలా మంది ప్రేమికులు తెగ భాధపడిపోతున్నారట. సో కరోనా వైరస్ లాక్ డౌన్ లో సామాన్యులు మరియు పేద ప్రజల తో పాటు ప్రేమికులు కూడా కష్టాలు బాగానే పడుతున్నారని చాలామంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news