Caution: గ్యాస్ సిలెండర్ లీక్ అవ్వకుండా ఉండాలంటే.. ఈ 5 తప్పులు అస్సలు చెయ్యొద్దు.. !

-

Caution: ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది. గ్యాస్ సిలిండర్ విషయాల్లో కొన్ని పొరపాట్లు చేయడం వలన సిలిండర్ పేలిపోయే అవకాశం ఉంటుంది. మంటలు వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. గ్యాస్ సిలిండర్ పేలిపోకుండా మంటలు రాకుండా ఉండాలంటే కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. చాలామంది తెలియక చేసే పొరపాట్ల వలన ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. గ్యాస్ సిలిండర్ పైప్ విషయంలో చాలా మంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు పైప్ ని మార్చుకుంటూ ఉండాలి. ఒకే పైపుని ఎక్కువ కాలం ఉపయోగించడం వలన సమస్య కలుగుతుంది. మారుస్తూ ఉండడం వలన గ్యాస్ లీక్ అవ్వదు.

ఒకవేళ గ్యాస్ లీక్ అయినట్లయితే పైప్ ని మార్చుకోండి. పైపు పాడైపోయింది అని అనుమానం వస్తే కూడా మీరు పైపుని మార్చుకోవాలి. అలాగే చాలామంది పొయ్యి పక్కన సిలిండర్ పెడుతూ ఉంటారు. ఈ పొరపాట్లు చేయకూడదు. వేరేగా స్లాబ్ కింద పెట్టేటట్టు చూసుకోవాలి. ఒకవేళ లీక్ అయినా ఏమైనా సమస్య వచ్చినా మంటలు వ్యాపించకుండా ఉంటాయి. కాబట్టి ఈ మిస్టేక్ కూడా చేయకుండా చూసుకోండి.

చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని పొయ్యి దగ్గరికి సిలిండర్ దగ్గరికి తీసుకు వెళ్ళకండి. చిన్నపిల్లలకి రెగ్యులేటర్ అందకుండా చూసుకోవాలి ఒకవేళ వాళ్ళు రెగ్యులేటర్ ఓపెన్ చేసేసి చేసేస్తే గ్యాస్ లీక్ అయిపోతుంది. కాబట్టి వీరానంత వరకు పిల్లలకి దూరంగా అందకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయితే కిటికీ తలుపులు, తలుపులు తెరిచి రెగ్యులేటర్ ని క్లోజ్ చేయండి. ఈ పొరపాట్లు అస్సలు చేయకుండా చూసుకోండి. లేదంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news