నిజంగా ఈ వార్త చూశారంటే షాక్ అవ్వాల్సిందే…! మానసిక పరిస్థితి బాలేదు అని ఒక బాధితుడికి డాక్టర్లు పుట్ట గొడుగులు తిను అని చెప్పారు. అయితే వాటిలో సిలోసిబిన్ (psilocybin) అనే మూలకం ఉంటుందట. దీనితో మెదడును ప్రశాంతంగా ఉంచుతుందట. డాక్టరు చెప్పారని అతను ఇంటికి వెళ్లి పుట్ట గొడుగులను జ్యూస్‌లా చేసి… డైరెక్టుగా ఇంజెక్షన్‌లా ఇచ్చుకున్నాడు. దీనితో తర్వాత నీరసం స్టార్ట్ అయ్యింది. డాక్టర్ ని సంప్రదిస్తే మొత్తం బయట పడింది. ఆ రసం నుంచి ఓ పుట్టగొడుగు సిర లో పెరిగినట్లు తెలిసింది.
ఇలా అది అతని లివర్ పని చేయకుండా చేసింది. అంతే కాదు బాడీ లో చాలా పార్టులు కూడా పని చేయకుండా మానేశాయి. ఇది అమెరికా రాష్ట్రం, నెబ్రాస్కాలో జరిగిన ఈ ఘటన. ఇలా ఆ 30 ఏళ్ల ఆ బాధితుడు చేయడం తో సిరల్లో పుట్టగొడుగు పుట్టింది. డాక్టర్లు ప్రాణాపాయం నుంచి మాత్రం కాపాడారు. అతను చేసిన పనికి యాంటీ-ఫంగల్ మందులు వాడాల్సి వచ్చింది.
డాక్టర్లు అతనికి వెంటనే రక్త మార్పిడి చేశారు. 22 రోజులు ఆస్పత్రి లో ఉంచి ట్రీట్‌మెంట్ చేశారు. ఇలా ఆ పుట్టగొడుగుల జ్యూస్‌ని తొలగించడానికి అన్ని రోజులు పట్టింది. కానీ కొన్ని రోజుల పాటు మందుల వాడాల్సి ఉంటుంది అని డాక్టర్లు చెప్పడం జరిగింది. కానీ ఏం వింతో కదా..!