వైరల్; మహిళకు ముద్దు పెట్టి, పిరుదల మీద కొట్టి పారిపోయాడు…!

-

ముంబైలోని ఒక రైల్వే స్టేషన్ వంతెనపై ఒక యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ముద్దు పెట్టి, వెనుక పిరుదుల మీద కొట్టి పారిపోయాడు ఆ యువకుడు. వివరాల్లోకి వెళితే తెల్లటి చొక్కా మరియు నీలిరంగు జీన్స్ ధరించిన ఆ యువకుడు రైల్వే బ్రిడ్జ్ పైకి వేగంగా వచ్చాడు. వెంటనే అక్కడ ఒంటరిగా ఉన్న మహిళను గుర్తించిన ఆ యువకుడు చిలిపి పని చేసాడు.

ఆ అమ్మాయికి ముద్దు పెట్టి… వెనుక పిరుదుల మీద కొడతాడు. కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతుంది. ఇది అక్కడ ఉన్న సీసీటీవీ ఫూటేజ్ లో రికార్డ్ అయింది. అతను ముద్దు పెట్టగానే ఆ అమ్మాయి షాక్ కి గురైంది. ఎటువంటి భయం లేకుండా ఆ అమ్మాయికి ముద్దు పెట్టేసాడు. మాతుంగాలోని రైల్వే స్టేషన్ వద్ద సిసిటివి కెమెరాలో ఇది రికార్డ్ అయింది.

గురువారం ప్రత్యేక దొంగతనం కేసులో అరెస్టయిన తర్వాత అతన్ని గుర్తించారు. అతనిపై దొంగతనం ఫిర్యాదు కూడా ఉందని పోలీసులు తెలిపారు. మహిళ ముందుకు వచ్చి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దీనిపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ప్రస్తుతం అతను దొంగతనం కేసులో బెయిల్ పై బయట ఉన్నాడు. ఈ సంఘటన జనవరి 25 న జరగింది. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పుడు మంచి చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news