కర్ణాటక లో మంత్రాలయం విద్యార్థుల రోడ్డు ప్రమాదం పై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతి తీవ్ర ఆవేదనను కలిగించిందని తెలిపారు.
రఘునందన తీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.