షాకింగ్ ;కియా కార్లు అమ్ముడు పోవట్లేదన్న విజయసాయి రెడ్డి…!

-

ఆంధ్రప్రదేశ్ లో కియా కార్ల కంపెనీ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అంతర్జాతీయ మీడియా కియా గురించి కథనం రాయడంతో ఇప్పుడు ఇది రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల కారణంగా ఆ కంపెనీ తమిళనాడు వెళ్లిపోతుంది అంటూ రాయిటర్స్ అనే మీడియా కథనం రాసింది. ఇప్పటికే కియా యాజమాన్యం తమిళనాడుతో కూడా చర్చలు జరిపింది అని రాసింది.

దీనితో ఒక్కసారిగా అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం తీవ్ర విమర్శలు చేస్తుంది పార్లమెంట్ వేదికగా కూడా దీనిపై టీడీపీ విమర్శలు చేసింది. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం అలాంటిది ఏమీ లేదని, కంపెనీ ఎక్కడికి వెళ్ళడం లేదని, ఇక్కడే ఉంటుందని,తమ సహకారం అందిస్తున్నామని పేర్కొంది. మంత్రి బుగన రాజేంద్ర నాథ్ రెడ్డి దీనిపై తీవ్ర విమర్శలే చేసారు.

కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇక ఇప్పుడు ఒక ట్వీట్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. గతంలో కియా వచ్చిన సమయంలో విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసారు. “కార్లు అమ్ముడు పోనీ కారణంగా కియా మోటార్స్ చైనాలోని అతిపెద్ద ప్లాంట్ ని మూసేసింది. మరి అనంతపురంలో ఏర్పాటు అవుతున్న ప్లాంట్ సంగతి ఏంటో మరి.

కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు రెండు వేల కోట్ల రాయితీలు ఇచ్చాడు. కంపెనీ ఉద్యోగుల్లో స్థానికుల్లో వంద మందికి మించి లేరు” అని ట్వీట్ చేసారు. నేడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో కియా కంపెనీ ఎక్కడికి వెళ్ళడం లేదు. వాళ్ళతో ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయని ట్వీట్ చేసారు. దీనిపై టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. తమకు అనుకూలంగా మాట మార్చడంలో ఆయన దిట్ట అంటూ టీడీపీ ఆరోపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news