కదిలే రైలు ఎక్కాలని ప్రయత్నించాడు.. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే..! వీడియో

-

కదిలే బ‌స్సులు, రైళ్లు ఎక్కడం, దిగడం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలిసినా త్వరగా వెళ్లాలనే ఆత్రుతతో చాలామంది కదిలే వాహ‌నాలు ఎక్కుతుంటారు. ఈ క్ర‌మంలోనే ప్రమాదాలకు గుర‌వ‌డం లేదా ప్రాణాల‌ను కూడా కోల్పోతుంటారు. క‌దిలే వాహ‌నం ఎక్క‌డం డేంజరో అని తెలిసినా కూడా దాన్ని పాటించేవాళ్లు మాత్రం చాలా తక్కువ. దీని గురించి ఎంత చెప్పినా జనాలు మాత్రం చెవికెక్కించుకోరు. అటువంటి ఘటనే ఒకటి గుజరాత్‌ అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ ప్రయాణికుడు ఆశ్రం ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కడం కోసం ప్లాట్‌ఫాం మీదకు వస్తున్నాడు. ఇంతలో రైలు కదలడం స్టాట్ అవ్వ‌డంతో సదరు వ్యక్తి పరిగెత్తుకు వెళ్లి క‌దిలే ట్రైన్‌ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్ర‌మంలోనే వ్యక్తి బోగిలోకి కాలు పెట్ట‌డంతో వెంటనే తలుపులు క్లోజ్ అయ్యాయి. దాంతో పట్టు కోల్పోయి పట్టాల మీద పడబోతుండగా అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది అతడిని పైకి లేపి బోగిలోకి నెట్టి ప్రమాదం నుంచి ర‌క్షించారు.

క్ష‌ణాల వ్య‌వ‌ధిలో ఆ వ్య‌క్తి మ‌ర‌ణ అంచుల వ‌ర‌కు వెళ్లి వచ్చాడు. ఈ వీడియోను రైల్వే శాఖ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో బాగా వైర‌ల్ అవుతుంది. దీనిపై నెటిజ‌న్లు రక‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సర్కస్‌ ఫీట్లు చేస్తే ఇలాగే ఉంటుంద‌ని, `ఈ ట్రైన్ కాక‌పోతే మ‌రో ట్రైన్‌.. ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాద‌ని`, అత‌డికి బాగా బుద్ధి వచ్చింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news