పెళ్లి కాని ఆడపిల్లల మీద మావోయిస్ట్ పార్టీ దృష్టి… ఆపరేషన్లకు వాళ్ళే కీలకం…!

మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు క్రమంగా బలహీనపడుతు వస్తుంది. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా కనపడటం లేదు. ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులు కావడంతో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ దళాల్లోకి వెళ్ళే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇక యువకులు స్మార్ట్ ఫోన్ వైపు అడుగులు వేయడంతో మావోయిస్ట్ పార్టీ కి కష్టాలు తప్పడం లేదు. వరుస కాల్పుల దెబ్బకు తల్లి తండ్రులు అయితే పిల్లలను అక్కడ ఉంచడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనితో భారీగా రిక్రూట్ మెంట్ అనేది ఆగిపోయింది.

తాజాగా విడుదలైన కొన్ని నివేదికలు మావోయిస్ట్ పార్టీ రిక్రూట్ మెంట్ గురించి తెలిస్తేనే ఇంత భయంకరంగా ఉంటాయా అనిపిస్తుంది. గత ఏడాది ఐఖ్యరాజ్య సమితి మావోయిస్ట్ పార్టీ నియామకాల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ముక్కుపచ్చలు ఆరని చిన్నారులను పార్టీలోకి తీసుకుంటున్నారని, తన నివేదికలో చెప్పిన ఐరాసా వాళ్లంతా లోకజ్ఞానం తెలియని 16-18 ఏళ్ల పిల్లలు. అడవి తప్ప సమాజం గురించి అవగాహన లేని లేలేత మనసులు. వాళ్ల మెదడులో విషబీజాలు నాటుతున్నారు.. నక్సలైట్లు. అంతటితో ఆగకుండా ఓ చీటీపై కొందరు యువకుల పేర్లు, రాసి లాటరీ వేస్తున్నారు.

అందులో ఎవరి పేరు వస్తే వారిని బలవంతంగా మావోయిస్టుల దళాల్లోకి లాక్కెళ్తున్నారని అప్పుడు పేర్కొంది. ఇప్పుడు మరో విషయాన్ని ఒక సంస్థ బయటపెట్టింది. మావోయిస్ట్ పార్టీ ఆడపిల్లల మీద ఎక్కువగా దృష్టి పెట్టిందని పేర్కొంది. ఏదైనా దాడుల కోసం ఆడపిల్లలు అయితే చురుకుగా ఉంటారని వారిని ఎక్కువగా ఉద్యమంలోకి మావోయిస్ట్ పార్టీ తీసుకుంటుందని సర్వే పేర్కొంది. మానవ హక్కులకు సంబంధించి పని చేసే ఈ సంస్థ… పెళ్లి కాని ఆడపిల్లలకు మావోయిస్ట్ పార్టీలోకి తీసుకువెళ్ళి వాళ్ళు చూసిన సంబంధాలతో పెళ్ళిళ్ళు చేస్తున్నారట. చత్తిస్గడ్ రాష్ట్రంలో,మహారాష్ట్రలోని రెండు జిల్లాల్లో ఈ దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది.