ఒక్కో ఎమ్మెల్యేకి 25 కోట్లు ఆఫర్… ఎమ్మెల్యేల దగ్గర ఫోన్లు తీసుకున్న కాంగ్రెస్..!

-

మహారాష్ట్రలో శనివారంతో అసెంబ్లీ గడువు ముగుస్తుంది… ఇప్పుడు అక్కడి పార్టీలు ఏం చేస్తాయి…? పట్టు వీడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకి బిజెపి శివసేన వస్తాయా…? కాంగ్రెస్ ఎన్సీపీల ఏం చేస్తాయి…? 15 రోజుల నుంచి వినపడుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే సమయం ఆసన్నమైంది. రెండున్నర ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి పదవి తమకు కావాలని శివసేన పట్టుబడుతూ అసలు ఒప్పందం ఇదేనని వ్యాఖ్యానిస్తుంది. అటు బిజెపి ముఖ్యమంత్రి పదవిని ఎవరికి ఇచ్చేది లేదని తామే అయిదేళ్ళు ఉంటామని అంటుంది.

ఈ నేపధ్యంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారనే భయంతో శివసేన తమ ఎమ్మెల్యేలను హోటల్ కి తరలించింది. అటు కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేలతో నిత్యం మాట్లాడుతుంది. గురువారం తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక్కో ఎమ్మెల్యేకి బిజెపి 25 కోట్లు ఆఫర్ చేసిందని కాంగ్రెస్ నేత నితిన్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కర్ణాటక తరహాలో జరగనివ్వమని ఆయన స్పష్టం చేస్తూ ఇలాంటి ప్రయత్నాలు బిజెపి ఆపాలని సూచించారు.

అటు ఎన్సీపీ నేతలు కూడా బిజెపి తమ ఎమ్మెల్యేలను భయపెడుతుంది అనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా శివసేన చీఫ్ ఉద్దావ్ థాకరే, పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ హోటల్ లో ఎమ్మెల్యేలతో భేటి అయ్యారు. ఎమ్మెల్యేలు అందరూ ఒకటిగా ఉండాలని ఆయన సూచించారు. దీనితో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. శనివారంతో ఏ పార్టీ ముందుకి రాకపోతే మాత్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేల దగ్గర ఫోన్ లు కూడా తీసుకుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news