అమర జవాన్ల తల్లులకు పాదాభివందనం చేసిన మంత్రి నిర్మలా సీతారామన్: వీడియో

-

జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో జరిపిన ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ కు చెందిన 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఆ ఘటన యావత్తు దేశాన్నే కలిచివేసింది. భారతదేశమంతా ముక్తకంఠంతో ఆ దాడిని వ్యతిరేకించింది. దానికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను భారత వైమానిక దళం ధ్వసం చేసింది. ఆ దాడిలో 250 నుంచి 300 మంది దాకా ఉగ్రవాదులు మృతి చెందినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.

తాజాగా.. పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన అమర జవాన్లకు నివాళిగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అమర జవాన్ల తల్లులకు పాదాభివందనం చేశారు. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో నిర్వహించిన శౌర్య సమ్మాన్ సమరోహ్ కార్యక్రమంలో అమర జవాన్ల తల్లులను సన్మానించిన నిర్మలా.. వారికి పాదాభివందనం చేశారు. కొందరు తల్లులు వద్దని వారిస్తున్నా.. వాళ్లకు వినమ్రంగా తలవంచి ఆమె నమస్కరించిన తీరును చూసి అక్కడి వారు, నెటిజన్లు నిశ్చేష్టులయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version