15ఏళ్ల కిందట పోలీస్ మిస్సింగ్.. ఇప్పుడెలా అయ్యాడో తెలుసా..!

-

మానసికంగా అనారోగ్యానికి గురైన ఓ పోలీసు అధికారి ఉద్యోగంలో చేరిన కొన్నేళ్లకే కనిపించకుండా పోయాడు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొలువు వచ్చిన కొన్నేళ్లకే ఆ అధికారి మానసిక వ్యాధికి గురయ్యాడు. కుటుంబాన్ని వదిలి కనిపించకుండా పోయాడు.కట్ చేస్తే 15ఏళ్లకు ఓ ఫుట్‌పాత్‌పై బిచ్చగాడిలా శారిరకంగా కుంగిపోయి.. చలికి వణికిపోతూ తన సహచరులకు కనిపించాడు.

police
police

డీఎస్పీలు రత్నేశ్ సింగ్ తోమర్, విజయ్ సింగ్ బహదూర్లు ఓ వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ అధికారి వాళ్లకు కనిపించాడు. బిచ్చగాడిలా ఫుట్‌పాత్‌పై ఎవరో తినగా మిగిలిపోయిన ఆహారం కోసం వెతుకుతున్నాడు. అతడిని చూసి ఆ అధికారుల కళ్లల్లో నీళ్లు ఆగలేదు. వాహనం దిగి తనకు చలివేయకుండా జాకెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పడు ఆ పోలీసు అధికారి వారిని పేర్లతో పిలిచాడు. అంతే డీఎస్పీలు ఆశ్చర్యపోయారు. అప్పుడు అతను బిచ్చగాడు కాదని 2005లో తప్పిపోయి తమ సహచరుడు మనీష్ మిశ్రా అని గ్రహించారు.

దేతియాలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తు సమయంలోనే మనీశ్ తప్పిపోయాడు. డీఎస్పీ రత్నేశ్ సింగ్ తోమర్ మాట్లాడుతూ.. ఇన్నేళ్లూ తను ఎక్కడున్నాడో తెలియదని అన్నారు. ఆపై అతని కోసం గాలించినా ప్రయోజనం లేకపోయిందని, ఇన్నాళ్లకు అతను తిరిగి కనిపించాడని హర్షం వ్యక్తం చేశారు. గ్యాలియర్ క్రైమ్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేస్తున్న రత్నేశ్ తోమర్, మనీశ్‌లు ఒకే బ్యాచ్‌కు చెందినవారు.

ప్రస్తుతం మనీశ్‌ను ఓ స్వచ్ఛంద సంస్థకు తరలించామని, తదుపరి ఏర్పాట్లు చేసేవరకు అక్కడే ఉంటాడని డీఎస్పీ మనీశ్‌, బహదూర్‌ తెలిపారు. మనీశ్ మిశ్రా చాలా మంచి అథ్లెట్, షార్ప్ షూటర్.. మేమిద్దరం 1999లోనే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరాం.. కొన్నేళ్ల తర్వాత అతడిని మానసిక సమస్యలు వేధించాయని రత్నేశ్ సింగ్ తోమర్ తెలిపారు. కుటుంబసభ్యులు చికిత్స చేయించారు. కానీ, అనుకోకుండా తప్పిపోయాడు’ అన్నారు. ఈ వార్త ప్రస్తుతం అందరిని ఓ పక్క ఆశ్యర్యానికి మరోపక్క బాధకు గురిచేస్తుందని పలువురు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news