కేసీఆర్ వందల ఎకరాలు ఇచ్చారు, మేము పుట్టిన రోజు చేస్తే తప్పా: వైసీపీ ఎమ్మెల్యే

-

బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు టీడీపీపై మండిపడ్డారు. శారదా పీఠం స్వామివారి జన్మదినం వివాదం కావడంతో ఆయన స్పందించారు. రాష్ట్రంలో ప్రతీ అంశాన్నీ రాజకీయం చేయడం టిడిపి గ్యాంగ్ కు అలవాటైంది అని ఆయన మండిపడ్డారు. శారదాపీఠం స్వామివారి జన్మదినాన్ని కూడా రాజకీయం చేస్తోంది అని విమర్శలు చేసారు. 2016 లో కూడా టీడీపీ శారదాపీఠం స్వామివారి జన్మదిన వేడుకల విషయంలో అధికారులకు పంపింది అని ఆయన గుర్తు చేసారు.

అదే విధంగా వైసీపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు పంపింది అని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్వామీజీల సంప్రదాయాలు గౌరవిస్తుంది అన్నారు. 2016లో పాటించిన సంప్రదాయం ఇప్పుడు ఎందుకు తప్పు అవుతుంది అని, బూట్లు వేసుకుని పూజ చేసిన చంద్రబాబు పార్టీలో యనమల ఏ రకంగా శారదాపీఠం స్వామీజీ కోసం ఇచ్చిన ఆర్డర్ ను విమర్శిస్తారు అని నిలదీశారు. పక్కన ఉన్న కేసీఆర్ శారదాపీఠానికి వందల ఎకరాలు ఇచ్చారు అని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news