శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుకోవటానికి చిట్కాలు… తప్పక పాటించండి..!

-

మనిషి శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడటానికి కంచు కోటలా కాపలా కాసే సైనికుల్లా రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు పని చేస్తాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తిలో ఈ తెల్ల రక్త కణాలు పనిచేస్తాయి. ఇవి కూడా ఎర్ర రక్త కణాలు లాగానే ఎముక మద్య భాగంలో ఏర్పడతాయి. ఇవి నిరంతరం రక్త ప్రవాహంలో కలిసి రోగాల పై పోరాడతాయి. అటువంటి క్రమంలో కొన్ని సార్లు వీటి సంఖ్య తగ్గుతుంది.

తెల్ల రక్త కణాలు తగ్గడం వల్ల శరీరం క్రమంగా క్షీణిస్తుంది. అలసట, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు, బద్ధకం గా ఉండటం, తరచుగా వ్యాధుల బారిన పడటం వంటి లక్షణాలు కనపడతాయి. అయితే వీటికి కొన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటి ఆక్సిడెంట్ లు, తగు మోతాదులో మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వీటి సంఖ్యను పెంచుకోవచ్చు. ఆహార పదార్థాలు ఏమిటంటే విటమిన్ ఇ ఎక్కువగా ఉండే క్యారెట్, బీట్ రూట్ వంటివి తీసుకోవాలి. మరియు జింక్ అధిక మొత్తంలో లభించే గుమ్మడికాయ, పుచ్చకాయ, వెల్లుల్లి వంటివి ఎంతో ఉపయోగం.

విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి వంటివి అధిక మొత్తంలో తీసుకోవాలి. గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. పాల కుర, బ్రకోలి, చిలకడ దుంపల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ లు రాకుండా నివారిస్తాయి. ఇంకా చేపలు, పాలు, పాల ఉత్పత్త్హులు వంటి వాటిలో తెల్ల రక్త కణాలను పెంచే విటమిన్లు పుష్కలం గా లభిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news