మ్యూచువల్ ఫండ్లలో డివిడెండు, గ్రోత్ ఆప్షన్ ల అర్థమేమిటి? వాటిల్లో ఏది ఎంచుకుంటే ఉత్తమం?

-

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకువేవారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. తాము ఎందులో పెట్టుబడి పెడుతున్నారనేది వారికి స్పష్టంగా తెలిసి ఉండాలి. అడ్వైజర్ సలహా మేరకు పెట్టేవాళ్ళు కొంచెమైనా ఫండ్ల విషయంలో జ్ఞానం సంపాదించాలి. ముఖ్యంగా ఏ స్కీములో పెడుతున్నారు? ఏ ఆప్షన్ తీసుకున్నారు అనేది చాలా ముఖ్యం. చాలామందికి ఇక్కడే ఒక సందేహం ఉంటుంది. ఒకే స్కీమ్ పేరు మీద రెండు ఫండ్లు కనిపిస్తుంటాయి. ఒకదానిలో గ్రోత్ అని, మరొకదానిలో డివిడెండ్ అని ఉంటుంది.

ఈ రెండు పేర్ల మధ్య తేడా ఏంటనేది వారికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీకు ఏది అవసరం అనిపిస్తే అందులోనే పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

డివిడెండ్

స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉన్నవారికి దీని గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. కానీ సామాన్యులకి పెద్దగా తెలియదు. సాధారణంగా డివిడెండ్ ఆప్షన్లో కంపెనీకి వచ్చిన లాభాలను పంచేస్తుంది. అంటే డివిడెండ్ ఆప్షన్ తీసుకుంటే కొన్ని రోజులకి( ఫండ్ నిర్ణయించిన ప్రకారం) వచ్చిన లాభాలని పంచుతుంది. ఒక్కోసారి అది మూడునెలలకి ఒకసారి ఉండవచ్చు. ఆరు నెలలు ఉండవచ్చు. అంటే, మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి లాభం వచ్చిందనుకుందాం. అప్పుడు ఆ లాభాన్ని ఫండ్ లో పెట్టుబడి పెట్టిన ప్రతీ ఒక్కరికీ పంచుతుంది. రెగ్యులర్ గా ఆదాయం కావాలనుకునే వాళ్ళు ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు.

గ్రోత్

గ్రోత్ ఆప్షన్ లో ఇలా లాభాలు పంచడం ఉండదు. ఒక్కసారి పెట్టుబడి పెట్టామంటే మళ్లీ విత్ డ్రా తీసుకునే వరకు అలాగే ఉంటుంది. డివిడెండ్ లో అప్పుడప్పుడు డబ్బులు వెనక్కి వస్తాయి. గ్రోత్ లో అలా రాదు. మీరు కావాలి అనుకుని రిక్వెస్ట్ పెడితేనే విత్ డ్రా అవుతుంది. సో.. మీ పెట్టుబడి లక్ష్యానికి ఏది సరైనదో మీరే డిసైడ్ అవ్వాలి.

గమనిక: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టేముందు స్కీముకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా చదవండి.

Read more RELATED
Recommended to you

Latest news