వామ్మో..ఏం క్రియెటివిటి రా నాయనా..బీరును కూడా వదలరా..

కరోనా మహమ్మారి కారణంగా మనుషులకు చావు తెలివితేటలు వచ్చాయి..దాంతో వింత పనులు చేస్తున్నారు..ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఒకరిని మించి మరొకరు వింత ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు మరోకటి వైరల్ అవుతుంది.ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లకు ఏ మాత్రం కొదవ ఉండదు. చిత్ర విచిత్రమైన దుస్తులు, నగలు, వాచ్‌ల, బ్రేస్‌లెట్లు.. ఇలా ఎన్నో వెరైటీలను మనం తరచూ ఆన్‌లైన్‌లో చూస్తూ ఉంటాం..

లాస్ట్ ఇయర్ ఒక ఫ్రెంచ్‌ డిజైనర్‌ ఆకు ఆకారంలో బ్యాగును డిజైన్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆతర్వాత ఈ ఏడాది జనవరిలో శాండ్‌విచ్‌ ఆకారంలో ఉన్న షూస్‌ తయారుచేసి షాక్‌ ఇచ్చాడు. ఇప్పుడు వీటికి మించిన వార్త ఒకటి సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. అదేంటంటే ప్రముఖ బీర్‌ బ్రాండ్‌ కంపెనీ హీనెకెన్ షూ సర్జన్‌ అనే పేరుతో సరికొత్త స్నీకర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ షూస్‌లు బీరుతో నింపబడి ఉంటాయి. కాగా ఈ కస్టమైజ్డ్ స్నీకర్ కలెక్షన్‌ను ప్రారంభించేందుకు హీనెకెన్ సంస్థ ప్రముఖ షూ డిజైనర్ డొమినిక్ సియాంబ్రోన్‌తో జతకట్టింది. ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలోనే ఈ మోడళ్లను మార్కెట్ లోకి తీసుకొచ్చారు.

బీర్‌ను పాప్ చేయడానికి ఇన్‌బిల్ట్ బాటిల్ ఓపెనర్‌ ఉంటుంది. అంతేగాక బీర్‌ అరికాళ్లలో ఇంజెక్ట్‌ అవ్వడానికి సరళమైన సర్జికల్ ఇంజెక్షన్ పద్ధతిని ఉపయోగించారు. ఈనేపథ్యంలో షూ సర్జన్‌ ధరించిన వారు బీరు తాగిన అనుభూతిని పొందవచ్చు. అయితే రోజూ ధరించడానికి ఈ షూస్‌ పనికిరావట. అప్పుడప్పుడు ధరించేవారికి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయట. కాగా వీటిని సోమర్‌సెట్‌లోని లిమిటెడ్ ఎడిషన్ వాల్ట్‌లో ఆగస్టు 11 నుండి 24 వరకు ప్రదర్శనకు ఉంచనున్నారు. వీటిలో కొన్నింటిని ఈ ఏడాది చివరిలో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకున్నారు. కాగా ‘వాకింగ్‌ ఆన్‌ బీర్‌’ అంటూ హీనెకెన్ తయారుచేసిన ఈ బీర్‌ షూస్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..ఇక వాటిని చూసిన నెటిజన్లు ఒక్కోక్కరు ఒక్కో కామెంట్ చేస్తున్నారు.. దాంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి..మీరు ఒకసారి చూడండి..