రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్… కొత్తగా రిలాక్స్ జోన్..!

-

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇప్పుడు కొత్తగా రైల్వే స్టేషన్స్ లో రిలాక్స్ జోన్ ని స్టార్ట్ చేసారు. రైల్వే స్టేషన్ లో వెయిట్ చేయాలంటే ఇక ఎటువంటి చిరాకు ఉండదు. హ్యాపీ గా రిలాక్స్ జోన్ లో చిల్ అవ్వొచ్చు. అయితే అన్ని స్టేషన్ల‌ లో ఇది రాలేదు. కేవలం గుజరాత్ ‌లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌ లో ఐల్యాండ్ ప్లాట్‌ ఫామ్‌ లో దీనిని తీసుకు వచ్చారు.

అసలు ఏమిటి ఈ రిలాక్స్ జోన్..? ఇది ప్రయాణికులకు ఎలా ఉపయోగ పడుతుంది..? వంటి విషయాలని కూడా ఇప్పుడు చూసేద్దాం. ప్రయాణికులకు మెరుగైన సేవల్ని అందించేందుకు భారతీయ రైల్వే మరో ప్రయోగం చేసింది. అదే ఈ రిలాక్స్ జోన్. మొదటి సారిగా గుజరాత్‌ లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌ లో ఐల్యాండ్ ప్లాట్‌ఫామ్‌లో రిలాక్స్ జోన్ ప్రారంభించింది.

ప్రయాణికులు రిలాక్స్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. సాధారణంగా ఇలాంటి రిలాక్స్ జోన్స్ ప్లాట్ ‌ఫామ్ నెంబర్ 1 లో ఉంటాయి. కానీ ఈ రిలాక్స్ జోన్ ప్లాట్‌ఫామ్ నెంబర్ 4, 5 ప్రయాణికుల కోసం ప్రారంభించారు. దీనిలో చాల ఫెసిలిటీస్ వున్నాయి. ఏసీ రెస్ట్ ఏరియా, లెగ్ మసాజ్ చెయిర్, ఇంటర్నెట్ సర్ఫింగ్, ప్రింట్ ఔట్, ఫోటో కాపీ సదుపాయాలు, ట్రావెల్ డెస్క్, బిజినెస్ సెంటర్, మ్యూజిక్, డిసర్ట్ కౌంటర్స్, ప్యాక్డ్ ఫుడ్ వంటి సూపర్ సదుపాయాలు మనకి దీని నుండి కలుగుతాయి.

రిలాక్స్ జోన్ ద్వారా భారతీయ రైల్వేకు ఏటా రూ.12 లక్షల ఆదాయం లభిస్తుంది. దేశంలోని మరిన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఇలాంటి రిలాక్స్ జోన్లు ఏర్పాటు చేస్తారట. దీని వలన రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు రిలాక్స్ అవ్వొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version