సంచలనం; డ్రగ్స్ ని అరికట్టడానికి తుపాకి పట్టిన 15 ఏళ్ళ పిల్లలు…!

-

మెక్సికో’ డ్రగ్స్ కి ఈ దేశం పెట్టింది పేరు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఈ దేశం ఎప్పుడు ముందు ఉంటుంది. ఇక్కడి నుంచి పలు దేశాలకు మాదక ద్రవ్యాలను, నల్ల మందు ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటారు. దీనితో ముక్కు పచ్చలు ఆరని చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ కి బానిసలు గా మారిపోతున్నారు. దీనితో ఆ దేశంలో నేరాల శాతం కూడా గణనీయంగా పెరిగిపోతూ వస్తుంది.

ఈ నేపధ్యంలో అక్కడి నల్లమందు మరియు గంజాయి, మాదకద్రవ్యాల ముఠాల మధ్య గొడవల కారణంగా దేశంలో హత్యల రేటు పెరిగిపోతుంది. మెక్సికోలోని అత్యంత పేద మరియు హింసాత్మక ప్రాంతాల్లో గెరెరో ఒకటిగా ఉంది. దీనిపై అధికారుల ఉదాసీనత కూడా నేరాలను పెంచేస్తుంది. ఈ నేపథ్యంలో, 600 మంది పిల్లలు స్వచ్ఛందంగా మిలీషియా దళంలో చేరారు.

బాస్కెట్‌బాల్ కోర్టు వద్ద 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు ప్రతి వారం కొన్ని గంటలు వివిధ డ్రిల్ సహా రైఫిల్స్ మరియు చేతి తుపాకులు లేదా తాత్కాలిక ఆయుధాలతో శిక్షణ ఇస్తూ ఉంటారు. దీనితో ఇప్పుడు వీళ్ళు అందరూ డ్రగ్స్ వ్యాపారుల మీద పోరాటం చేయడానికి సిద్దమవుతున్నారు. వాళ్ళు కనపడితే కాల్చి చంపెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news