కరోనా వైరస్ నేపధ్యంలో చైనాలో ఉన్న తెలుగు విద్యార్ధులు ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నారు. చైనాకు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విద్యను అభ్యసించడానికి గాను వేలాది మంది విద్యార్ధులు వెళ్ళారు. అలాగే పలు ఉన్నత చదువులకు కూడా చైనా వెళ్ళారు. కరోనా వైరస్ అక్కడ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో చైనాలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
ఇతర రాష్ట్రాలు, నగరాలకు ప్రయాణ మార్గాలను మూసేసింది చైనా. కొన్ని నగరాలకు వెళ్లడాన్ని నిషేధించింది. ఈ నేపధ్యంలో అక్కడి విద్యార్ధులు కష్టాలు పడుతున్నారు. షాపింగ్ మాల్స్, ఆహార సముదాయాలను మూసేసింది చైనా ప్రభుత్వం. దీనితో అక్కడి విద్యార్ధులకు తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరికే పరిస్థితులు కనపడటం లేదు. చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టినా, ఇండియన్ ఎంబసీని సంప్రదించినా ఫలితం లేదని అంటున్నారు.
కనీసం తినడానికి తిండి లేదు తాగడానికి నీరు లేదు. ఇండియా వచ్చేద్ద్దామని చూసినా కుదరడం లేదు. అక్కడ అన్ని విమానాశ్రయాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసారు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి దారి లేదని, బులెట్ ట్రైన్స్ కూడా క్యాన్సిల్ చేసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్ధులు. ఫ్లైట్ బుక్ చేసుకున్నా వెళ్ళే అవకాశం లేదని అంటున్నారు. దీనితో ఇప్పుడు తమను ఆదుకోవాలని భారత ప్రభుత్వం కోరుతుంది.