వైరల్ వీడియో: ఈ జీవిని ఎప్పుడైనా చూసారా గురూ…? ఇదేంటి ఇలా ఉంది…?

-

కర్ణాటకలోని కబినీ ఫారెస్ట్ లో కెమెరాకి చిక్కిన అరుదైన జీవి ఏమిటో ఇప్పుడు తేలిపోయింది. కొద్ది రోజుల క్రితం, ఓ ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసుకుంటూ ముందుకు వెళ్తుండగా అతనికి ఓ వింత జీవి కనిపించింది. అంటే… అది ఏ జీవో అర్థం కాని పరిస్థితి. చూడ్డానికి ముంగిసలా, ఎలుగు బంటిలా, సీల్ చేపలా కనిపిస్తోంది. అదేమిటో చెప్పండి అంటూ అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. అయితే అది బ్లాక్ పాంథర్ అదే నల్ల చిరుత అని నెటిజన్లు తేల్చారు.

అయితే ఇది చిరుత కాదని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ పేర్కొన్నారు. మార్టెన్ జాతి జంతువుల్లో నీలగిరి మార్టెన్ మాత్రమే దక్షిణ భారత్ లో కనిపిస్తాయని రామెన్ ట్వీట్ చేశారు. పశ్చిమ కనుమల్లో కూడా ఇవి ఉంటాయని పేర్కొన్నారు. మొదట దీనిని చూడగానే బ్లాక్ పాంథర్ అనిపిస్తుంది. కానీ నిదానంగా అది వెనక్కు తిరగగా పసుపు రంగు మెడని చూడొచ్చు. ఇంట‌ర్నేష‌న‌ల్ యూనియ‌న్ ఫ‌ర్ క‌న్జ‌ర్వేష‌న్ ఆఫ్ నేచ‌ర్ జాబితాలో మార్టెన్‌ కూడా హాని క‌లిగించే జంతువని పేర్కొన్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news