భారతదేశంలో ఏ పౌరుడైన ఏ రాష్ట్రంలో కి వెళ్లే స్వతంత్రం ఉంది. అయితే ఓ గ్రామంలో కి మనకు ప్రవేశం లేదు. నిజానికి అది కూడా భారత దేశంలో ఉన్న గ్రామమే. అయితే అక్కడికి కేవలం భారతీయులని కాకుండా ఏ ఇతర ప్రజలను లోపలికి అనుమతించరు. ఎందుకు అనుమతించారు? దాని వెనుక రహస్యం ఏంటి అనేది మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.
సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తులో ఉన్న పార్వతి లోయను పచ్చని, మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం మలానా. ఇక్కడ నివసించే ప్రజలు ఇతర ప్రజలను వారి గ్రామంలోకి అనుమతించరు. వారి అనుమతి లేకుండా వారి వస్తువులను కూడా ఎవరూ తాకరు. స్నేహపూర్వకంగా ఉంటారు కానీ గ్రామంలో దేనిని తాక వద్దు అని హెచ్చరిస్తుంటారు.
ఈ గ్రామ సరిహద్దులలో గ్రామవాసులు ఇతరులను ఎవరినీ ఉండనివ్వరు. అందువల్ల వారితో ఎవరూ కలవరు కనీసం తాగడానికి నీళ్ళు కూడా అడగరు. ఇతరులను వారు శత్రువులుగా భావిస్తారు. ఇందుకు ఒక కారణం కూడా ఉంది. క్రీస్తుపూర్వం 326వ సంవత్సరంలో అలెగ్జాండర్ తన సైనికులు కొంతమంది పంజాబ్ పాలకుడు పోరుస్క్ కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో గాయపడిన తన సైనికులను అక్కడే వదిలి వెళ్లారు.
ఆ తరువాత ఆ సైనికులు అక్కడే ఆశ్రయం పొందారని నమ్ముతారు. దీనివల్ల అక్కడి ప్రజలు అలెగ్జాండర్ వారసులం అని చెప్పుకుంటారు. మిగతా వారి కంటే వారు చాలా భిన్నంగా ఉంటారు. వారి భాష కనిషిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ భాషను బయట ఇతరులెవరూ వాడకూడదు. పర్యాటకులను దేవాలయాల్లోకి అనుమతించరు. ఎందుకంటే వారు బయట వ్యక్తులని అంటరానివారిగా భావిస్తారు.
వీరి గ్రామంలో హైడ్రో పవర్ స్టేషన్ అందుబాటులో ఉంది. కనుక విద్యుత్ సమస్య లేదు. అలాగే వీరు స్వతహాగా వ్యవసాయ పనులు చేసుకుంటారు. వీరి గ్రామంలో ఒక స్కూల్ కూడా ఉంది. ఇలా వీరు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తమ పని వారే చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు.