టెన్నిస్ లోనే కాదు చదువులోనూ ముందే.. 14ఏళ్లకే డిగ్రీ పూర్తి..!

-

టేబుల్ టెన్నిస్ క్రీడలో జాతియస్థాయిలో రాణిస్తున్న ఆగస్త్య జైస్వాల్ చదువులోను తన దూకుడు ప్రదర్శిస్తున్నాడు. పిన్న వయసుులోనే రికార్డులు సృష్టిస్తున్నాడు. 14ఏళ్లకు పదోతరగతి చదవాల్సి వయసులో ఏకంగా డిగ్రీ కంప్లీట్ చేశాడు. హైదరబాద్ కాచీగూడాకు చెందిన ఈ బుడతడిపై మీరు ఓ లుక్కేయండి..!

Agatsya-Jaiswal

కాచిగూడకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆగస్త్య జైస్వాల్‌. టెన్నీస్ క్రీడలో దుమ్ములేపుతున్న జైస్వాల్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో మాస్‌ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యాడు. యూసుఫ్‌గూడలోని సెయింట్‌ మేరీ కాలేజీలో బీఏ మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం చదివాడు. 9 ఏళ్ల వయసులోనే 10వ తరగతి, 11 ఏళ్లలో ఇంటర్‌ పూర్తి చేశాడు. జర్నలిసం పైన ఉన్న ఇష్టంతోనే డిగ్రీలో ఈ కోర్సు చేసినట్లు జైస్వాల్ వెల్లడించాడు.

తెలంగాణ రాష్ట్రంలోనే 14 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిన బాలుడిగా ఆగస్త్య జైస్వాల్‌ రికార్డు సృష్టించాడు. ఇతనే కాదు.. జైస్వాల్ సోదరి కూడా ఇదే బాటలో ఉందండి.. నైనా జైస్వాల్ టేబుల్ టెన్నిస్ లో అంతర్జాతీయ స్థాయిలో ఓ పక్క రాణిస్తునే 13ఏళ్ల వయసులోనే డిగ్రీ పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా మంగళవారం కాచిగూడలో తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి, అశ్విన్‌కుమార్‌లతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అగస్త్య జైస్వాల్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆగస్త్య జైస్వాల్‌ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే విభిన్న రంగాల్లో రాణించడం వెనుక తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, కృషి ఎంతో ఉందన్నాడు. స్కూల్‌కు వెళ్లకుండా తల్లిదండ్రులనే తన గురువులుగా చేసుకుని క్రీడా, విద్యా రంగాల్లో రాణిస్తున్నట్లు తెలిపాడు. రత్నాలాంటి కుమారుడు, కుమార్తెను కన్నారని బంధుమిత్రులు జైస్వాల్ తల్లిదండ్రులను అభినందిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా టేబుల్ టెన్నిల్ మరిన్ని రికార్డులు సృష్టిస్తానని అందుకు తగ్గుటు సాధన చేస్తాని జైస్వాల్ తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news