ఆ టీ స్టాల్‌లో ఒక క‌ప్పు టీ ఖ‌రీదు రూ.1000.. ఎందుకంత స్పెష‌ల్‌..?

-

సాధార‌ణంగా మీరు బ‌య‌ట టీ తాగితే ఒక క‌ప్పు టీ కి మీరు ఎంత చెల్లిస్తారు ? రూ.10 ? రూ.20 ? రూ.50 ? ఫ్యాన్సీ కేఫ్ అయితే రూ.100.. అంత వ‌ర‌కు చెల్లిస్తారు. కానీ మీకు తెలుసా..? ఆ టీ స్టాల్‌లో ల‌భించే ఓ ప్ర‌త్యేక‌మైన టీ ఒక క‌ప్పు తాగితే రూ.1000 చెల్లించాలి. అవును మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ ఆ స్టాల్ ఎక్క‌డ ఉందంటే..?

one cup of special tea in that stall costs rs 1000 know about it

కోల్‌క‌తాలోని ముకుంద‌పూర్‌లో నిర్జ‌ష్ అనే ఓ వ్య‌క్తి టీ స్టాల్‌ను న‌డుపుతున్నాడు. అత‌ని వ‌ద్ద అనేక ర‌కాల టీ లు ల‌భిస్తాయి. వాటిల్లో బో-లే టీ కూడా ఒక‌టి. ఆ టీ పొడి కేజీ ఖ‌రీదు రూ.3 ల‌క్ష‌లు. అందువ‌ల్ల ఆ పొడితో టీ త‌యారు చేసి ఇస్తే ఒక క‌ప్పుకు రూ.1000 చార్జి వ‌సూలు చేస్తాడు. అందుక‌నే ఆ టీ కి అంత‌టి ధ‌ర ఏర్ప‌డింది. అది చాలా ప్ర‌త్యేక‌మైన టీ. అందుక‌నే అంత‌టి ధ‌ర ఉంటుంది. దాన్ని ప్ర‌త్యేక‌మైన ప‌ద్ధ‌తిలో త‌యారు చేస్తారు. అత్యంత అరుదైన తేయాకు ర‌కానికి చెందిన ఆకుల‌ను ఉప‌యోగిస్తారు. క‌నుక‌నే ఆ టీ పొడి ధ‌ర రూ.ల‌క్ష‌ల్లో ఉంటుంది.

ఇక అత‌ని వ‌ద్ద ఆ టీ కాకుండా సాధార‌ణ టీ కూడా లభిస్తుంది. అతని వద్ద ఒక క‌ప్పు సాధార‌ణ టీ ఖ‌రీదు రూ.12 ఉంటుంది. ఇక టీ వెరైటీని బ‌ట్టి ఆ ధ‌ర రూ.1000 వ‌ర‌కు ఉంటుంది. ఒక్కో ర‌క‌మైన టీ కి ఒక్కో ర‌క‌మైన ధ‌ర ఉంటుంది. ఈ క్ర‌మంలోనే అత‌ని వ‌ద్ద వైట్ టీ, లావెండ‌ర్ టీ, హిబిస్క‌స్ టీ, వైన్ టీ, తుల‌సి అల్లం టీ, బ్లూ టిసేన్ టీ, టీస్టా వాలీ టీ, మ‌కైబ‌రీ టీ, రూబియోస్ టీ, ఓకాయ‌టి టీ.. ఇలా అనేక ర‌కాల టీ లు అత‌ని వ‌ద్ద ల‌భిస్తున్నాయి. 2014 నుంచి అత‌ను ఇలా వివిధ వెరైటీల టీలు అమ్ముతూ వేగంగా వృద్ధిలోకి వ‌చ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news