సామాన్యుడికి షాక్.. మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు.. ఎంతంటే ?

-

ఈ మధ్య కాలంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రతి రోజూ పెంచుతూ వచ్చిన కంపెనీలు ఈ మధ్య గ్యాప్ ఇచ్చాయి. అయితే ఈ రోజు మాత్రం వంట గ్యాస్‌ ధరలను పెంచాయి. ఏకంగా వంట గ్యాస్‌ పై రూ.25 పెంచారు. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. ఇక పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌ ధర రూ.819కు పెరిగింది.

ఇక హైదరాబాద్‌ లో నిన్నటి దాకా సిలిండర్ ధర రూ.846.50గా ఉండగా ధర పెంపుతో రూ.871.50కి చేరింది. మిగతా ముఖ్య నగరాల విషయానికి వస్తే బెంగళూరులో రూ.823, చెన్నైలో రూ.835, ముంబైలో రూ.819, కోల్కతాలో రూ.845కి చేరింది. అయితే గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 100 రూపాయలు పెరగడం గమనార్హం. ఈ నెల 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా 15న తేదీన మరో రూ.50 వడ్డించాయి. అలానే చివరిగా 25న కూడా 25 రూపాయలు పెరిగాయి. 

Read more RELATED
Recommended to you

Latest news