లాక్ డౌన్ లో చైనీయుల అతి పెద్ద స్కాం…1100 కోట్లు !

-

ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్న ఒక ముఠాని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు పదకొండు వందల కోట్లకు పైగా ఆన్లైన్ బెట్టింగ్ కు ఈ ముఠా పాల్పడినట్టు చెబుతున్నారు. పోకో పేరుతో ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్న ఒక చైనా కంపెనీ మీద దాడులు చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక చైనీస్ వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఈ గ్యాంగ్ సేకరించినట్టు చేబుతునారు.

2014 లో తెలంగాణా స్టేట్ ఏర్పాటు అయిన తరువాత ఆన్ లైన్ గేమింగ్ ను ప్రభుత్వం నిషేధించింది, అయినా సరే ఆన్ లైన్ గేమింగ్ పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. టెక్స్ట్ , ఇమేజ్ బేస్, వీడియో బేస్ లు ద్వారా ఆన్ లైన్ గేమింగ్ నడుస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇండియా యూత్ ను టార్గెట్ గా చేసుకొని ఈ చైనా ఆన్ లైన్ గేమ్స్ ద్వారా మోసం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 1100 కోట్లు వరకు ఈ గేమ్స్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆన్ లైన్ గేమ్ లో మోసపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version