ఏదైనా ట్రిప్ కి వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీ బట్టలని ఇలా ప్యాక్ చేసుకోండి..!

-

సాధారణంగా మనం ఏమైనా దూర ప్రాంతాలకు వెళ్తున్నాం అంటే ఎక్కువగా బట్టలని తీసుకెళ్లాల్సి ఉంటుంది. పైగా విపరీతమైన బరువుగా ఉంటాయి. స్పేస్ కూడా తక్కువ ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే అంత బరువులు ప్యాక్ చేసుకోవడం కంటే సులువుగా ఈ పద్ధతిని ఉపయోగించి దుస్తుల్ని ప్యాక్ చేసారంటే అంత బరువు ఉండదు. పైగా కాస్త తెలివిగా సామాన్లని సర్దుకోవచ్చు.

కంప్రెషర్ బ్యాగులను ఉపయోగించండి :

డివైడర్స్ వల్ల అవి సెపరేట్ చేయడం మాత్రమే కాకుండా అన్నీ సరిగ్గా సర్దుకోవడానికి వీలవుతుంది పైగా ఇస్త్రీ మడతలు కూడా పోకుండా ఉంటాయి. తక్కువ స్పేస్ లో ఎక్కువ సామాన్లు పడతాయి కూడా. కాబట్టి వాటిని ఉపయోగించండి.

ఫోల్డింగ్ ట్రిక్స్ ని పాటించండి :

బట్టల్ని రోల్ చేసి పెట్టడం వల్ల చాలా మటుకు స్పేస్ మనకి కవర్ అవుతుంది. కాటన్ దుస్తులని రోల్ చేయడానికి వీలు అవ్వదు వాటిని ఫ్లాట్ గా ఉంచండి. అదే సింథటిక్ మొదలైన మెటీరియల్స్ అయితే మీరు రోల్ చేస్తే ఈజీగా స్పేస్ కవర్ అవుతుంది.

తక్కువ సామాన్లు సర్దుకోండి:

మీరు ఒక 15 రోజుల పాటు ట్రావెల్ చేస్తున్నా లేదు అంటే ఎక్కడికైనా ఎక్కువ రోజులు ట్రావెల్ చేయాలని అనుకున్నా తక్కువ బట్టలు తీసుకెళ్లండి. అక్కడ ఉన్న లాండ్రీ ఫెసిలిటీస్ ని ఉపయోగించుకుని ఇక్కడి నుంచి తక్కువ బట్టల్ని తీసుకెళ్లండి.

ఇలా సెలెక్ట్ చేసుకోండి :

అన్నిటినీ తీసుకెళ్లడం కంటే ఒక ప్యాంటు మీదకి 2, 3 షర్ట్స్ లేదా టాప్స్ సెట్ అయ్యేటట్టు చేసుకోండి. ఇలా కూడా మీరు తక్కువ బట్టలు తీసుకెళ్లొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news