ఎఫ్ 3లో మూడవ హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే?

Join Our Community
follow manalokam on social media

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ 2, ఎంతటి విజయాన్నందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 పనులు మొదలెట్టాడు. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఎఫ్ 2లో చేసిన నటీనటులనే పెట్టుకున్న అనిల్ రావిపూడి, ఇందులో మరో హీరోయిన్ ని ఎంచుకున్నాడట. తమన్నా, మెహ్రీన్ లతో పాటు మరో హీరోయిన్ కనిపించనుందట.

లెజెండ్, రూలర్ సినిమాల్లో కనిపించిన సోనాల్ చౌహాన్, ఎఫ్ 3లో అలరించనుందని తెలుస్తుంది. లెజెండ్, రూలర్ సినిమాల్లో సోనాల్ చౌహాన్ ఎంత గ్లామరస్ గా కనిపించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోనూ తన అంద చందాలతో ప్రేక్షకులని ముగ్ధులని చేయనుందట. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో పెద్దగా అవకాశాలు తెచ్చుకోలేకపోతున్న సోనాల్ కి ఎఫ్ 3లో అవకాశం రావడం అదృష్టమే.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...