ఆ గ్రామంలో ప్రతి వ్యక్తి సంపాదన రూ.32 లక్షలు.. అయినా వారు దుస్తులు ధరించరు.. ఎందుకో తెలుసా..?

-

ధనం బాగా సంపాదించే వారు ఎవరైనా సరే విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు. ఆహారం, వినోదం.. ఇలా సకల సదుపాయాలు ఉంటాయి. అయితే ఆ గ్రామంలో ప్రతి వ్యక్తి సంపాదన రూ.32 లక్షలు. నిజానికి ప్రపంచంలో ఇంతటి తలసరి ఆదాయం ఉన్న వ్యక్తులు కలిగిన గ్రామాల్లో అది నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. అయినప్పటికీ వారు దుస్తులను ధరించరు. అవును. నిరాడంబర జీవితాన్ని గడుపుతారు. ఎందుకంటే..?

persons in this uk village earns more but they do not wear clothes why

యూకేలోని హెర్ట్‌ ఫోర్డ్‌ షైర్‌ సిటీలో ఉన్న స్పిల్‌పాల్ట్జ్‌ గ్రామం అది. అక్కడ ఒక్కో వ్యక్తి సగటు సంపాదన 46,600 డాలర్లు. అంటే సుమారుగా రూ.32.62 లక్షలు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన వ్యక్తులు ఉన్న గ్రామాల్లో ఆ గ్రామం మొదటి స్థానంలో ఉంది. కానీ వారు దుస్తులను ధరించరు. కేవలం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దుస్తులను ధరిస్తారు. 1929లో ఆ గ్రామం ఏర్పడింది. దాని జనాభా ప్రస్తుతం 10 లక్షలు. అయితే వారు అప్పటి నుంచి ఒక నియమం పెట్టుకున్నారు. బయటి ప్రపంచం నుంచి దూరంగా ఉండాలని, వారితో సంబంధం లేకుండా గడపాలని, తమ ప్రాంతంపై బయటి ప్రపంచం దృష్టి పడకుండా ఉండాలని వారు భావించారు. అందుకనే అప్పటి నుంచి వారు దుస్తులను ధరించడం లేదు. కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దుస్తులను ధరిస్తారు.

కాగా ఆ గ్రామంలో యూకేకు చెందిన ప్రముఖ కంపెనీలు నెలకొల్పబడ్డాయి. ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల్లో ఆ గ్రామంలో ఎంతో అభివృద్ధిని సాధించింది. అందుకనే అక్కడి వ్యక్తుల తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. 2003 నుంచి ఆ గ్రామం ఆయా రంగాల్లో వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తూ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news