సంక్రాంతికి పందెం కోళ్లు మామూలే..ఈ వరాహాల యుద్ధం చూశారా..ఎక్కడోకాదు ?

-

సంక్రాంతి..అంటేనే కోడి పందేలు, పిండి వంటలు..ఇంటికి బంధువుల రాక..అబ్బో ఆ హడావిడే మాములుగా ఉండదు. ప్రతి ఇళ్లు సందడి సందడిగా మారుతుంది. వద్దన్నా ఆడే కోళ్ల పందాలు..వెనకాలే వచ్చే పోలీసులు..వాళ్లను చూసి పరుగుతీసి ఎలాగోలా తప్పించుకుంటారు కొందరు. ఇవన్నీ కొన్ని రోజలు తర్వాత చెప్పుకుంటే..మధురజ్ఞాపకాలుగా మారుతాయి. అయితే..సంక్రాంతికి కోళ్ల పందెల‌కు ఎంత ప్రాముఖ్య‌త ఉందో అంతే ప్రాముఖ్య‌త మ‌రో పందెల‌కు కూడా ఉంద‌నే విష‌యం మీకు తెలుసా.? అవే పందుల పందేలు. అనంత‌పురం జిల్లా తాడి ప‌త్రిలో ఈ పందుల పందేలు ప్ర‌తి సంక్రాంతికి నిర్వ‌హిస్తారు. ఈ పందెలో గెలిచిన పందికి ల‌క్ష‌ల్లో న‌గ‌దు న‌జ‌రాన నిర్వ‌హ‌కులు ఇస్తుంటారట.

పందులకు ట్రైనింగ్‌..

ప్ర‌తి సంవత్సరం నిర్వ‌హించే ఈ పందుల పందేల కోసం వాటికి మంచి ట్రైనింగ్ ఇస్తారు. పందెం కోళ్ల మాదిరిగానే ఇవీ సకల భోగాలు అనుభవిస్తాయట. ఈ పందుల కోసం ప్ర‌త్యేకంగా డ్రై ప్రూట్స్ తో చేసిన ఆహారాన్ని పెట్ట‌డ‌మే కాకుండా వాటికి స‌ద‌ర్ స‌మ‌యంలో ఎద్దుల‌కు తాగించిన‌ట్లు మందు కూడా తాగిస్తారు. భలే గమ్మత్తుగా ఉంది కదూ.. అయితే మ‌రో రెండు వారాల్లో సంక్రాంతి హ‌డావిడి మొద‌లు కాబోతున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఈ పందుల పందేల‌పై అంద‌రి దృష్టి.. ప‌డుతుంది. ప్ర‌తి ఏడాది జేసీ బ్ర‌ద‌ర్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తారట.

తెలంగాణలో కూడా..

కోన‌సీమ ప్రాంతంలో కోళ్ల పందెల‌కు ఎంత ప్రాముఖ్య‌త ఉందో రాయ‌ల‌సీమ‌లో జ‌రిగే ఈ పందుల పోటీల‌కు కూడా అంతే డిమాండ్‌ ఉంది. తెలంగాణ‌ జిల్లాల నుంచి కూడా ఈ పందుల పోటీలు పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తుంటారు. తెలంగాణ‌లో ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌ నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో సంక్రాంతి స‌మ‌యంలో ఈ పందుల పోటీలు నిర్వ‌హిస్తారు.

ఈ పోటీల కోసం ఆంధ్రా ప్రాంతం నుంచే కాకుండా కర్ణాట‌క నుంచి కూడా ప్ర‌త్యేకంగా పెంచిన వరాహాలతో వచ్చి పోటీల్లో పాల్గొన్నటాయట. తెలంగాణలో అయితే సంక్రాంతి సమ‌యంలో జ‌రిగే తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల స‌మ‌యంలో ఈ పోటీలు జరుగుతాయి.

ఈ పందుల పోటీలు తెలంగాణ ప్రాంతంలో 1960 నుంచి అనావాయితీగా వ‌స్తున్నాయి. వరాహాల మధ్య పోటీ నిర్వహించి గెలుపొందిన వరాహం యజమానికి రూ.లక్ష బహుమతిగా అందిస్తారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఒక్కో పంది విలువ రూ.15 వేలనుంచి రూ.45 వేల ఉంటుందని పెంపకందారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news