పోలీసు సారూ.. మీది చాలా మంచి మనసు..

-

పోలీసులు క్రిమినల్స్ ను పట్టుకోవడం మాత్రమే కాదు.. మంచి పనులు కూడా చేస్తారు..సాయం అడిగిన వారికి తోచిన సాయాన్ని కూడా చేస్తారు.అలా చాలా మంది పోలీసులు మంచి మనసును ఛాటుకున్నారు..ఇప్పుడు మరో పోలీస్ అధికారి కూడా తన మంచి మనసును ఛాటుకోవడంతో సోషల్ మీడియాలో స్టార్ హీరో అయ్యాడు.అతని స్టోరీ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

అతని పేరు రంజిత్ సింగ్..ఎండలు ఒకవైపు మండిపోతున్నాయి.విధి నిర్వహణలో మునిగి ఉన్నాడు. అంతలోనే ఇద్దరు చిన్నారులు రోడ్డుపై కంట పడ్డారు.రోడ్లపై చెత్త ఏరుకునే చిన్నారులు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా వారిలో ఒక చిన్నారి కాళ్లకు చెప్పులు లేకపోవడంతో కాళ్లు మండిపోతున్నాయి. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ రంజిత్ సింగ్ దగ్గరకు వెళ్లి రోడ్డు దాటించేందుకు సహాయం చేయాలని కోరారు. అప్పటికే సిగ్నల్ ఆన్ కావడంతో కొంచెం సేపు ఆగమని చెప్పారు.

సారూ త్వరగా దాటించండి.. కాళ్ళు మంటలు పుడుతున్నాయి అని ఓ చిన్నారి అతన్ని అడిగాడు.రంజిత్‌ సింగ్‌ ఆ చిన్నారిని తన పాదాలపై నిలబడమని చెప్పాడు. కానిస్టేబుల్ చెప్పినట్టుగానే ఎండ వేడిని తట్టుకోలేక చిన్నారి కానిస్టేబుల్ పాదాలపై నిలబడ్డాడు. రెడ్‌ సిగ్నల్ పడగానే ఆ ఇద్దరిని రంజిత్‌ సింగ్‌ రోడ్డు దాటించారు..ఈ దృశ్యాన్ని అక్కడ ట్రాఫిక్ లో నిలిచి ఉన్న కొందరు కెమరాలో బంధించారు.అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.. ఆ పిల్లలను రోడ్డు దాటించి, ఇద్దరికీ బట్టలు, చెప్పులు కొనిచ్చాడు..ఇక ఈ కానిస్టేబుల్ గతంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గిర డ్యాన్స్ వేస్తూ ట్రాఫిక్ ను కంట్రోల్ చేశాడు..ఏది ఏమైనా కూడా ఇలా పిల్లల కోరికను తీర్చడం నిజంగా గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకోవడం నిజంగా గ్రేట్.. హ్యాట్సాఫ్..

blockquote class=”twitter-tweet”>

२ बच्चे रोड क्रॉस कर रहे थे सिग्नल बंद थाबच्चे के पाँव जल रहे थेबच्चे ने कहा सर पाव जल रहे हे रोड क्रॉस करवा दो पर रोड पर सिंगल बाइक वालों का चालू था मेने कहा जब तक ट्रैफ़िक रुकता नहीं मेरे पेर पर पेर रख लोओर जेसे ही उसने ऐसा किया मुझे ऐसा लगा जेसे भगवान ने मेरे ऊपर पाव रख हो pic.twitter.com/rS3zTYnV9t

— Ranjeet singh (@THEMOONWALLKAR) May 19, 2022

Read more RELATED
Recommended to you

Exit mobile version