పేమెంట్ యాప్స్‌పై కొరడా ఝళిపించిన ఆర్బీఐ

-

కస్టమర్లకు సేవలందించే ఏ సంస్థ అయినా సరే.. నిబంధనలను పాటించకపోతే.. చర్యలు తీసుకోవడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇప్పుడు బ్యాంకులకు ఎవరు పోతున్నారు. అంతా స్మార్ట్‌ఫోన్‌లోనే. క్షణాల్లో డబ్బులను ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయం వచ్చింది. పేమెంట్ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం, కస్టమర్లను ఆకర్షించడానికి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ ప్రకటించడంతో కస్టమర్లంతా పేమెంట్ యాప్స్‌కు అట్రాక్ట్ అయ్యారు. అందులోనూ క్షణాల్లో ఆ యాప్స్ నుంచి డబ్బులు పంపించుకునే వెసులుబాటు ఉండటంతో కస్టమర్లు ఆ యాప్స్‌ను ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తోంది.

అయితే.. ఇదివరకే గూగుల్ పే.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం లేదని ఓ కోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా… నిబంధనలు సరిగ్గా పాటించని కొన్ని పేమెంట్ యాప్‌లపై కొరడా ఝుళిపించింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం, 2007 ప్రకారం పేమెంట్ సంస్థలకు జరిమానా విధించిందట.

వొడాఫోన్‌కు చెందిన ఎం పెసా యాప్‌కు 3.05 కోట్ల ఫైన్, తర్వాత మొబైల్ పేమెంట్ యాప్స్ అయినటువంటి ఫోన్ పే, ప్రైవేట్ అండ్ జీఐ టెక్నాలజీకి కోటి చొప్పున ఫైన్, వై క్యాష్ కు 5 లక్షల ఫైన్ విధించింది. వాటితో పాటు అమెరికాకు చెందిన వెస్టర్న్ యూనియన్‌కు సుమారు 29 లక్షలు, మనీగ్రామ్‌కు సుమారు 10 లక్షల జరిమానా విధించిందట ఆర్బీఐ. ఈ విషయాన్ని ఆర్బీఐ ధృవీకరించింది.

కస్టమర్లకు సేవలందించే ఏ సంస్థ అయినా సరే.. నిబంధనలను పాటించకపోతే.. చర్యలు తీసుకోవడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version