ఫస్ట్ కాజ్ : సర్ ఆర్థర్ కానన్ డాయల్ రాసిన ఆంగ్ల కథ అనువాదం
(ఒంటి చేయి మనిషి) చదువుతూ చదువుతూ
నిగ్రహ సంబంధ ఆజ్ఞలను పొందడం సులువుగా చేతనవదు..చేతన సంబంధ చర్యలు సులువుగా తమని తాము నిలుపుకోవు..ఓ చోట ఆగిపోవడం చేతన సంబంధం నిలుపు కోవడం నిగ్రహ సంబంధం..ఒకటి ఆత్మ సంబంధం మరొకటి జ్ఞాన సంబంధం..నేర్చుకోవాలి వికాస సంబంధాలకు సుముఖంగా ఉండడం నేర్చు కోవాలి..ఇంద్రియ సంబంధం ఒకటి వాటికి అతీత సంబంధం ఒకటి ఏదో ఒకటి.. తేల్చుకోవాలి ఈ విజ్ఞాన శాస్త్రం ఏం నేర్పుతుందో తెల్సుకునే ప్రయత్నాలు ఆ నందాలను పోగేస్తాయి…అందుకనో / ఎందుకనో
ఇంద్రియాలకు అతీతంగా ఈ కాలం ఆజ్ఞలు జారీచేసి పోతోంది
పోతున్నవన్నీ వచ్చినవన్నీ గుణ నిష్పత్తులకు అందనివి
ఆత్మజ్ఞాన ప్రభోదాలు ఏవీ మనలో లేని క్షణాన తప్పులు లెక్క తేలవు
తేలే లెక్కలన్నీ ఎక్కడో ఓ చోట బెడిసి కొట్టి నవ్విపోతాయి
ఒక కథ చదువుతూ రాస్తున్నాను..
అనువాద కథ చదువుతూ చెబుతున్నాను..
జీవిత కాల జ్ఞాపకాలు మానవాతీత శక్తులు గురించి ఏమయినా వివేచించాలి.. తీర్పరి జ్ఞానం ఒకటి ఉంటుందని వింటే అది ఏమ యినా ఒక సందర్భం దగ్గర మనల్ని వివేకవంతులను చేస్తుందేమో చూడాలి..ఎప్పుడయినా అతీంద్రియా లకు అవగాహన అన్న ది ఉంటుంది..లేదా అవగాహన లోపం ఒకటి మనలో ఉంటుంది..శక్తి ఆదేశాలను ఎలా అయినా పొందాలి..పొందినవి విచ్ఛేదకం అ యితే గుర్తించాలి..అతీంద్రియం అన్నది అవగాహన లోపంలో ఉంది..లుప్తం అ యిన జ్ఞానంలో ఉంది. చనిపోయిన వారి ఆదేశానుసారం ఉంది.. బతికున్న వా రి మంద మతిలో ఉంది. మతిలో ఉంది..సంబంధిత మహిలో ఉందో లేదో ఎరు క లేదు..లేదా గ్రహణలో ఉంది.
దేహాలకు చపలత అన్నది ఉంది..ఈ చపల త బాధిస్తోంది.. రేయి విడిచిన అజ్ఞానంలో నేనున్నానా అని ఆదేశిస్తూ పోతోంది.. కనుక చపలత అన్నది అజ్ఞాన సంబంధంలో ఉంది. కానీ జ్ఞాన సంబంధ చపల త అత్యంత దృష్టి సంబంధ బాధ. దృష్టి సంబంధ బాధలు చికిత్సకు నోచు కుంటే మేలు. పరస్పర అవగాహనలో దేహాలుంటాయి/పరస్పరం కాని అవగాహనలో మౌనాలుంటాయి/ ఒకసారి వీటిలో స్పష్టత పొందామా! ఇక తిరుగుండదు కానీ పొం దేందుకు కావాల్సిన విజ్ఞత మనలో ఉందో లేదో అన్నదే ఓ అవగాహన మూడుంటాయి – అవి పడి ఉండవు పడి లేస్తాయి – దృష్టి జ్ఞానం చర్య
చర్యను విడదీస్తే శక్తిని ప్రసాదిస్తుంది..శక్తిని క్రోడీకరిస్తే జ్ఞానం సంప్రాప్తిస్తుంది..జ్ఞానం దృష్టికి ఆపాదిస్తే వికాసం సిద్ధిస్తుంది..ప్రేతాత్మల పరిశోధనల గురించి చదివేను.మనో వైజ్ఞానిక ఆపాదనలు గురించి తెల్సుకున్నాను..మీలో ఉన్నది వెల్లడిలో ఉన్నది ఒక్కటి కానప్పుడే పొందిన విభేదం జ్ఞానం.. జ్ఞానాన్ని విశదీకరించే దృష్టి అత్యావశ్యకం.. ఆవశ్యకం ఏదయినా అది వ్యాప్తిలో ఉంటే ఆనందం అలాంటి పరివ్యాప్తక నియమాదులను ప్రేమిస్తూ పోతాను.. అపుడు భ్రమలు పోతాయి ఊహలు మిగులుతాయి.
మిగులు ఊహలు లెక్క తేలుతాయి..అలాంటి ప్రజ్ఞను నేను పొందుతాను..కాలం ప్రేతాత్మ సంబం ధ జీవితాలను పట్టి ఇస్తే అవి ఎలానో ఒకలా నా చుట్టూ పరిభ్రమించడం మొద లుపెడ్తాయి..అలాంటి ఆరంభా న్ని ఒకటి ఆహ్వా నిస్తాను..ఆత్మ సంబంధ జ్ఞా నాలకు మొగ్గు చూపేందుకు వీలుగా నన్ను నేను మలుచుకుంటే మలుపు చెంత ఎదురగు ప్రమాదాలను గుర్తించగలను.కనుక ప్రేతాత్మలు, ప్రత్యేక ఆత్మ లు మనచుట్టూనే పరిభ్రమించడం చేస్తుంటాయి..అవి తమ ఆదేశానుసారం ఉంటాయి..విజ్ఞత లోపించిన మనుషులు వాటికి భయాలు అని పేర్లు పెడ్తారు ..వీటినే ఫోబియోలు అని అంటారు.
కొన్ని సిండ్రోమ్ లు కూడా ఆనందాలకు ఆనవాలుగానే ఉండవొచ్చు కదా! బాధాకరం ఏంటంటే భయాలను జయిస్తూ పోతుంటే కొత్త సవాళ్ల స్వీకారం ఒకటి ఇబ్బందికరం కావడం వైజ్ఞానికానికి పె ను ముప్పు..కనుక వైజ్ఞానికం గెలవనీయండి అని వేడుకుంటాను ఈ మను షులను.. ఆరంభంలో ఇంతటి వైజ్ఞానిక ధార లేదు.. ఉన్నచోట పడి ఉండడం అన్నది అప్పటి చైతన్య సంబంధ వివరణ కావొచ్చు. ఈ ప్రేతాత్మ ధోరణలు ఆ త్మకు పీడింపు మార్గం ఒకటి అలవాటు చేసిపోతాయి.
కళ్లలో వెలుగులు లా క్కొని పోతాయి..తమని తాము నిర్వచించుకుని, కొత్త యుద్ధాలకు సిద్ధమని ఆదేశించి పోతాయి..ప్రేతాత్మలు క్రియా సంబంధం అని చెప్పలేం కానీ వాటికి అ డ్డుగా తగిలే చర్యలకు ప్రేరకం అని మాత్రం చెప్పగలను.. ఇవి ప్రయోగ సంబం ధం.. మానసిక సంబంధం.. తార్కికం చెడిపోకుండా ఉండాలంటే వైజ్ఞానికం గెల వాలి. వీటిని భౌతిక చర్యల విశ్లేషణగా భావించాలి.ఒక్కోసారి ఊహ ప్రేతాత్మ సం బంధం కావొచ్చు/వీటికి వైజ్ఞానిక పరిజ్ఞానం పరిష్కారం ఇస్తుందని అన్నివేళలా అనుకోను/కొన్ని సందర్భాల్లో మాత్రమే అను కూలం అనుకున్న శక్తులు ఆరో గ్యదాయినిలు/ అవే ఉన్న రోగాలను తరిమి కొడతాయి అనుకుంటే తత్ సంబంధ శక్తుల విభజనే ఆత్మ జ్ఞానం.
దృశ్య ప్రావస్థలు
శబ్ద ప్రావస్థలు
ఏమయినా కానీయండి
ఒక చోట కదలిక నుంచి ఒక చోట పొందిన చైతన్యం వరకూ ఉంటాయి కనుక ఆ త్మ జ్ఞాన సిద్ధిని పొందడం అంటే వివేక సంబంధ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వడం /విజ్ఞాన సంబంధ ఆదేశానుసారం ఒకటో రెండో వైఫల్యాలను అంగీక రించడం /ఇ లాంటి సందర్భాల్లో జ్ఞాన విస్తారం ఒక అవసరం..భయాలు/ఆందోళనలు లేని వి కొన్ని/ చుట్టూ ఉంటే అవి భావోద్వేగ సంబంధం అయినవే కావు బుద్ధి సం బంధం అయినవి కూడా అయి తీరుతాయి/ రేపటి వేళ అవే మానవ మనుగడకు అత్యావసరాలు.. నిత్యావసరాలు
– రత్నకిశోర్ శంభుమహంతి