జియో సెలబ్రేషన్ ప్యాక్.. 10 జీబీ డేటా ఫ్రీ..!

-

జియో రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గత నెలలో సెలబ్రేషన్ ప్యాక్ పేరుతో 8 జీబీ ఫ్రీ డేటాను అందించింది కదా. ఆ ప్లాన్ ప్రకారం రోజుకు 2జీబీ డేటాను ఉపయోగించుకునేలా ఆఫర్ ను ప్రకటించింది జియో. మొత్తంగా నెలపాటు 8జీబీ డేటాను ఉచితంగా ఉపయోగించుకునేలా ప్రకటించింది జియో.

ఇప్పుడు అదే ఆఫర్ ను మళ్లీ ప్రకటించింది. సెలబ్రేషన్ ప్యాక్ పేరుతో మళ్లీ ఆఫర్ ను ప్రకటించింది. కాకపోతే ఇది సెలెక్టెడ్ యూజర్స్ కు మాత్రమే వర్తిస్తుంది. సెలెక్టెడ్ యూజర్స్ కు అదనంగా ఉచితంగా 10 జీబీ డేటాను అందించనుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 10 జీబీ డేటాను 5 రోజుల పాటు విభజించి రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుంది. కాకపోతే యూజర్లు ఆ డేటాను అక్టోబర్ 31, 2018 వరకే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

మరి.. మీరు ఈ ఆఫర్ కు ఎలిజిబులా కాదా.. అని తెలుసుకోవాలంటే.. మీ ఫోన్ లోని మైజియో యాప్ ను ఓపెన్ చేయండి. మైప్లాన్స్ సెక్షన్ లోకి వెళ్లండి. అక్కడ మీకు జియో సెలబ్రేషన్ ప్యాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీకు కనిపించలేదంటే మీరు సెలబ్రేషన్ ప్యాక్ కు అర్హులు కాదు.

Read more RELATED
Recommended to you

Latest news