రిలయన్స్ రిటైల్: ప్రపంచ పవర్ హౌస్ రిటైల్స్ లో స్థానం.. వేగంగా వృద్ధి చెందుతున్న రెండవ రిటైలర్ గా..

-

భారత కుబేరుడు ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ రిటైల్, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందిన రెండవ రిటైలర్ గా పేరు తెచ్చుకుంది. డెలాయిట్ ప్రచురించిన ప్రపంచ పవర్ హౌస్ రిటైలర్ల ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకుని అరుదైన ఘనతని దక్కించుకుంది.

డెలాయిట్ నివేదిక ప్రకారం రిలయన్స్ రిటైల్ 53వ స్థానంలో ఉంది. మొత్తం 250కంపెనీల్లో రిలయన్స్ స్థానం 53. అంతకుముందు సంవత్సరం ఇది 56వ స్థానంలో ఉండేది. యూఎస్ దిగ్గజం వాల్మార్ట్ కార్పోరేషన్ అగ్రస్థానం దక్కించుకుంది. ఇక అమెజాన్.కామ్ రెండవ స్థానంలో కాస్ట్ కో మూడవ స్థానంలో నిలిచాయి.

ఈ జాబితాలో మొదటి పది కంపెనీల్లో ఏడు కంపెనీలు అమెరికాకి చెందినవి కావడం విశేషం. టాప్ 10లో ఉన్న అమెరికాకి చెందిన కంపెనీల విషయానికి వస్తే, 5వ స్థానంలో క్రోగర్ కో 5వ స్థానం, వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ 6వ స్థానం, సివిఎస్ హెల్త్ కార్పొరేషన్ 9వ స్థానంలో ఉన్నాయి. జర్మనీకి చెందిన ఆల్డి ఐంకాఫ్ GmbH & Co. oHG ఆల్డి ఇంటర్నేషనల్ సర్వీసెస్ GmbH & Co. oHG 8 వ స్థానంలో ఉన్నాయి.

మొత్తం 250కంపెనీలో భారతదేశానికి చెందినది రిలయన్స్ రిటైల్ మాత్రమే. వాట్సాప్ తో భాగస్వామ్యం ఏర్పర్చుకుని జియో మార్ట్ ఫ్లాట్ ఫామ్ ని వృద్ధి చేసుకుంటుంది. ఇంకా చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి వాట్సాప్ తో భాగస్వామ్యం ఏర్పర్చుకుంది. 2019లో 29శ్రీ కన్నన్ డిపార్ట్ మెంటల్ స్టోర్లని కొనేసిన రిలయన్స్ రిటైల్ ఫ్యూఛర్ గ్రూపు రిటైలర్లను 3.4బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు 2020ఆగస్టులో ప్రకటించింది.

ఇది పూర్తయితే రిలయన్స్ రిటైలర్ స్టోర్ చాలా పెద్దది, దాదాపుగా రెట్టింపు అవుతుంది. అలాగే 2020లో రెండు ఈకామర్స్ సైట్లని కొనేసింది. వైటాలిక్ హెల్త్, దాని ఆన్‌లైన్ ఫార్మసీ ప్లాట్‌ఫామ్ నెట్‌మెడ్స్‌ను కొనుగోలు చేసింది. ఇంకా నవంబర్‌లో ఆన్‌లైన్ హోమ్ డెకర్ కంపెనీ అర్బన్‌లాడర్‌లో 96 శాతం వాటాను కొనుగోలు చేసింది.

ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీనివల్ల ఆర్థిక లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. వ్యాక్సినేషన్ మొదలగు కార్యక్రమాలు వేగంగా జరిగితే ఆర్థిక పురోగమనం చూడవచ్చు. మొత్తానికి ప్రపంచంలోని రిటైల్ పవర్ హౌస్ కంపెనీల్లో రిలయన్స్ చోటు సంపాదించుకోవడమే కాకుండా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా ఎదుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news