వైరల్ వీడియో: మధ్యలో ఆగిపోయిన రోలర్‌ కోస్టర్‌.. మూడు గంటలపాటు తలకిందులగానే…

-

రోలర్ కోస్టర్‌ అనగానే మనకు బ్రహ్మానందం సీనే గుర్తుకువస్తుంది. ఆపండ్రా బాబోయ్‌ అంటూ తెగ కేకలు వేస్తారు. చాలా మందికి సాహసకృత్యాలు చేయడం అంటే తెగ ఇష్టం. భయం ఉన్నా సరే.. ఆ మజా బాగుంటుందని చేస్తుంటారు. వండ్రిల్లా వెల్లినప్పుడు కచ్చితంగా రోలర్‌ కోస్టర్‌ ఎక్కే ఉంటారు. ఎక్కేముందు ఎంత భయం ఉన్నా.. ఒక్కసారిగా ఎక్కిన తర్వాత అది ఇగ తిప్పే తిప్పుడికి గుండెకాయ నోట్లోకి వచ్చేస్తుందేమో అన్నంత పని అవుతుంది. అలా రివర్స్‌ అయినప్పుడు అది సడన్‌గా ఆగిపోతే.. పై ప్రాణాలు పైనే పోతాయోమో కదా..! అయినా అలా ఎందుకు జరుగుతుందిలే అనుకుంటారా..? కానీ అలానే జరిగింది అక్కడ. రోలర్ కోస్టర్ ఆగిపోయి… 3 గంటల పాటు తలకిందులుగా ఉన్నారు.

రోలర్ కోస్టర్‌లో ఏర్పడ్డ ఓ సాంకేతిక సమస్య వల్ల మూడు గంటల పాటు అలాగే ఉండాల్సి వచ్చింది. ప్రాణాలను అరచేత పట్టుకొని జనాలు ఎప్పుడెప్పుడు తమను కిందకు దించుతారా అని క్షణాన్ని యుగంలా గడిపారు.

అసలేం జరిగిందంటే..?

అమెరికాలోని ఓ అమ్యూజ్ మెంట్ పార్కులో క్రాండన్ పార్క్ ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది రోలర్ కోస్టర్ రైడ్‌కు వెళ్లారు. ఈ రైడ్ స్టార్ట్ అయిన కాసేపటికే అందులో సాంకేతిక సమస్య వచ్చింది. మధ్యలోనే ఆగిపోయింది. ఇంకేముంది.. రైడ్‌కు వెళ్లిన వారంతా తలకిందులుగా వేలాడుతూ అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. ఏమాత్రం పట్టు తప్పినా వారి ప్రాణాలు పోయేవే. ఇలా మూడు గంటల పాటు ప్రజలంతా ప్రాణాలు అర చేత పట్టుకొని అలాగే ఉండిపోయారు. మూడు గంటల తర్వాత సమస్యను పునరుద్ధరించి వారందరినీ క్షేమంగా కిందకు దించారు. ఇందుకు సంబంధించిన భయానక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

జులై 4న మంగళవారం రోజు సాయంత్రం 5.23 గంటలకు ఈ వీడియోను Sasha White అనే వినియోగదారురాలు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియో కాసేపటికే నెట్టింట వైరల్ గా మారిపోయింది. ఇప్పటి వరకు వేలల్లో వ్సూయస్ రాగా వందల్లో కామెంట్లు వచ్చాయి. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇంత భయంకరమైన రైడ్ నేనెప్పుడూ చూడలేదని కొందరు.. ఎక్స్ పీరియన్స్ అదిరిందా ఫ్రెండ్స్ అని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో చూశాక.. రోలర్‌ కోస్ట్‌ ఎక్కాలంటే మీరు కూడా కచ్చితంగా ఆలోచిస్తారు..!

Read more RELATED
Recommended to you

Latest news