ట్రాఫిక్ పోలీసులంటే వాహనదారులకు పెద్ద తలనొప్పిలెక్క ఫీల్ అవుతుంటారు. వాళ్లు మనమంచికే అన్ని రూల్స్ పాటించాలని చెప్పినా మన చెవికి చెప్పనక్కర్లేదు. మనం ఏం తక్కువ కాదు..ఎలాగోలా బ్రేక్ చేయాలని చూస్తుంటాం. సడన్ గా దొరికిపోతే..ఏదోఒక అబద్ధం చెబితే తప్పించుకుంటాం. తాజాగా న్యూయార్క్ లో ఓ డ్రైవర్ చేసిన పనికి పోలీసులే షాక్ అయ్యారు. అసలు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందిరా అనుకుని ఆశ్చర్యపోయారట.
ఏం జరిగింది:
ఇక్కడ టూవే, వన్ వే ఎలా ఉంటాయో అలాగే విదేశాల్లో కొన్ని చోట్ల కార్లు డ్రైవ్ చెయ్యాలంటే వాటిలో మినిమం ఇద్దరు ప్రయాణికులు ఉండాలి. ఇక్కడ ఆటోలో వాళ్లుఆటో ఫుల్ అయితేనే ఎలా తీస్తాం అంటారో భలే అక్కడ ఇలా ఇద్దరు ఉండాలి అనే రూల్ మాత్రం పక్కాగా ఉండాలి. న్యూయార్క్లో ఓ కారు డ్రైవర్ చేసిన తుంటరి పని అక్కడి స్టఫ్పోక్ కౌంటీ పోలీస్ డిపార్ట్మెంట్ని స్టన్ అయ్యేలా చేసింది.
ఆ డ్రైవర్ HOV లేన్పై కారు నడుపుతున్నాడు. ఆ దారిలో వెళ్లాలంటే వాహనాల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉండి తీరాలట. కానీ ఆ కారులో డ్రైవర్తోపాటూ ఒకడే ప్రయాణికుడు ఉన్నాడు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు వెనక సీట్లో ప్రయాణికుడి పక్కన మరో వ్యక్తి ఉన్నట్లుగా కోటును సెట్ చేశాడు. దానికి ఆ డ్రైవర్ టోపీ కూడా పెట్టాడు. తద్వారా పోలీసులు చూసినా ఇద్దరు ప్రయాణికులు ఉన్నారులే అని అనుకుంటారని తను అనుకున్నాడు. కానీ పోలీసులు అలా అనుకోలేదు. కనిపెట్టేశారుగా. ట్రాఫిక్ లో ఇరుక్కోవటం వల్ల ఆ డ్రైవర్ చేసిన ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని HOV ఆక్యుపెన్సీ రూల్స్ అతిక్రమించినందుకు జరిమానా టికెట్ ఇచ్చారు.
గతేడాది కూడా ఇలాంటి ఓ ఘటన జరిగింది. అరిజోనాలో ఓ డ్రైవర్… బొమ్మ అస్థిపంజరాన్ని కారులో ఉంచి దానికి డ్రెస్ వేసి ఎల్లో కలర్ తాడుతో దాన్ని కదలనివ్వకుండా కట్టాడు. కానీ అప్పుడు కూడా పోలీసులు కనిపెట్టేశారు. దీన్ని బట్టీ టెక్సాస్ పోలీసులు ఎంత చురుగ్గా ఉన్నారో మనం తెలుసుకోవచ్చు.