హోమ్ లోన్ తీసుకోవాలని అనుకునేవారికి శుభవార్త…!

Join Our COmmunity

మీరు హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? మీరు మీ సొంతింటి కలని ఇప్పుడు నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్‌ తో మహీంద్రా లైఫ్ ‌స్పేస్ డెవలపర్స్ జతకట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే… స్టేట్ బ్యాంక్‌ తో మహీంద్రా లైఫ్ ‌స్పేస్ డెవలపర్స్ జత కట్టడం వలన కస్టమర్లకు సులభంగానే హోమ్ లోన్స్ లభించనున్నాయి. అలానే కస్టమర్లకు, ఉద్యోగులకు కూడా స్పెషల్ గా డిస్కౌంట్ వస్తుందట. అంతే కాదండి ఇప్పుడు ఇంకా ప్రత్యేక స్కీమ్స్‌ కూడా అందుబాటు లోకి రానున్నాయి.

ఇప్పుడు ఇలా స్టేట్ బ్యాంక్ ‌తో మహీంద్రా లైఫ్ ‌స్పేస్ డెవలపర్స్ జత కట్టడం వల్ల ఆనందంగా ఉందని చెప్పడమే కాక…. ఈ భాగస్వామ్యం వల్ల రెండు సంస్థల కస్టమర్లకు సులభం గానే హోమ్ లోన్స్ వస్తాయి అని అన్నారు మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్ సుబ్రమణియమ్. అయితే ఇప్పుడు కనుక ఎవరైనా హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటే మరెంత లాభం కలుగనుంది.

కాబట్టి కస్టమర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కస్టమర్లకు సులభం గానే హోమ్ లోన్స్ వస్తాయి. అలానే సొంతింటి కల కూడా నెరవేరుతుంది. స్టేట్ బ్యాంక్ ఇప్పటికే మహీంద్రా లైఫ్‌ స్పేస్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని… అయితే ఎం ఎం ఆర్, బెంగళూరు, పూణే, చెన్నై, నాగ్‌పూర్ వంటి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయని పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్‌ కి చెందిన రియల్ ఎస్టేట్ విభాగం హెడ్, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news