పిడుగు పడుతుందా లేదా చేప్పే యాప్ వజ్రపాత్!

-

feaవర్షాకాలం వచ్చేసింది. ఆలస్యంగానైనా వర్షాలు దేశం అంతటా పడుతున్నాయి. అప్పుడప్పుడు భారీ ఉరుములు, మెరుపులు. అంతేకాదు అక్కడక్కడ పిడుగులు. వీటితోనే అసలు సమస్య అంతా. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగేది వీటితోనే. అయితే ఇప్పుడు సాంకేతికత అందుబాటులో ఉండటంతో పిడుగు వివరాలు ముందే తెలుకోవచ్చు. కేవలం స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ఎలానో తెలుసుకుందాం….

పిడుగు ఎక్కడ, ఎప్పుడు పడుతుందో తెలియక ప్రాణనష్టాలు జరుగుతున్నాయి. పిడుగు ఎక్కడ పడుతుందో తెలసుకునే మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. వజ్రపాత్ యాప్ ద్వారా పిడుగు ఎక్కడ పడుతుందో తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్‌లో వజ్రపాత్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే ఫోన్ నంబర్ అడుగుతుంది. ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే మనకు ఏ భాష కావాలో ఎంచుకోవాలి. అనంతరం యాప్‌కు సంబంధించిన ముఖచిత్రం వస్తుంది.

వజ్రపాత్ యాప్ ముఖచిత్రంపై రెండు రకాల సమాచారం వస్తుంది. ఎడమ చేతి వైపు పిడుగు గుర్తుతో పాటు పిడుగు సమాచారం వస్తుంది. ఇక్కడ నొక్కితే మనం ఉన్న ప్రాంతం మ్యాప్‌లో వస్తుంది. మ్యాప్‌లో ఎరుపు, నారింజ, పసుపు

రంగుల్లో వలయాలు వస్తాయి. వలయాల పక్కన అంకెలు ఉంటాయి. ఆ అంకెల ప్రకారం కొద్ది సేపట్లో ఎంత దూరంలో పిడుగుపడే అవకాశం ఉందో చూపిస్తుంది. పిడుగుపడే అవకా శం ఉంటే ఎంత దూరంలో పడుతుందో పిన్ గుర్తు కనిపిస్తుంది. యాప్‌లో కుడిభాగంలో పిడుగుపాటు హెచ్చరికలు ఉంటాయి. ఇక్కడ నొక్కితే పిడుగు పడే అవకాశాలు ఉన్నాయా? లేదా? అనే సమాచారం వస్తుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news