గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసుగా..?

Join Our Community
follow manalokam on social media

‘మా ఊళ్లో గొర్రె, పొట్టేలు వివాహానికి అందరూ ఆహ్వానితులే‘ అంటు ఆ గ్రామ ప్రజలు మూగజీవాలకు అంగరంగ వైభంగ కల్యాణం జరిపించారు. మనుషుల వలే వధూవరులుగా పొట్టేలు, గొర్రెను సుందరంగా అలంకరించారు. మొదటగా దొడ్డి గంగమ్మకు సంప్రదాయబద్దంగా ప్రత్యేక పమిదలు వెలిగించారు. ఆ తర్వాత విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ శాస్త్రోక్తంగా జీవాలకు వివాహం జరిపించారు.

ఎక్కడ..?

చిత్తూరు జిల్లాలోని కేవీపల్లె మండలంలోని గ్యారంపల్లె పంచాయతీ కురవపల్లెలో గ్రామస్థుల సమక్షంలో గొర్రె, పొట్టేలుకు కల్యాణం నిర్వహించారు. ప్రతిసారి సంక్రాంతి పండగ తర్వాత
రెండ్రోజులకు మూగజీవాలకు వివాహం జరిపించడం ఆ గ్రామం ఆనవాయితీ. ఇలా మూగజీవాలకు కల్యాణం జరిపిస్తే పంట పొలాలకు చీడపీడలు తగలకుండా, గొర్రెలకు అంటు వ్యాధులు రాకుండా గౌరమ్మ కాపాడుతుందని ఆ గ్రామçస్థుల అపార నమ్మకం. అయితే.. ఈ కల్యాణంలో వరుడి వైపు కిరణ్‌కుమార్, వధువు తరఫు నుంచి దామోదర్‌ కుటుంబ సభ్యులు నిలిచి కల్యాణాన్ని జరిపించారు. గొర్రె పొట్టేలుగా జరిగిన కల్యాణానికి గ్రామస్థులందరూ çహాజరై వధూవరులను ఆశ్వీర్వదించారు.

పుణ్యకార్యంగా..

ఆ గ్రామంలో తాత ముత్తాతల కాలం నుంచి గొర్రె, పొట్టేలుకు కల్యాణం జరిపించడం ఆచారంగా వస్తోంది. గ్రామం సుభిక్షంగా ఉండి, పంటలు కళకళలాడాని, మూగ జీవాలను రోగాల నుంచి కాపాడాలని గౌరమ్మకు పూజలు చేస్తారు. మూగజీవాలకు కల్యాణం జరిపిస్తుండటంతో తమ గ్రామంలో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగవని గ్రామస్థులు పేర్కొంటున్నారు. తమ పూర్వీకుల నుంచి కొనసాగుతూ వస్తున్న ఆచారాన్ని తామంతా కొనసాగించడం పుణ్యకార్యంగా భావిస్తున్నాం. ఈ మూగజీవాల కల్యాణం మా గ్రామానికి పెద్ద పండగే. మా తరం ముగిసినా కూడా ముందు తరాలు కూడా ఇలా నిర్వహిస్తారని గ్రామ పెద్దలు చెబుతున్నారు.

TOP STORIES

అందరి ముందు మాట్లాడాలంటే భయమా…? అయితే ఇది మీకోసం…!

చాలా మంది కింద చాలా బాగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే చేతులు వణికి పోతాయి. అలానే పేనిక్ అయిపోతుంటారు. ఇది...