సాయిపల్లవితో తేజ ప్రయోగం

Join Our Community
follow manalokam on social media

స్టార్‌ హీరో మూవీ అయినా… యంగ్ హీరో సినిమా అయినా.. అందులో చెల్లిపాత్రైనా.. హీరోయిన్‌ రోల్ అయినా.. ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాయిపల్లవి. ప్రతి పాత్ర ఈ అమ్మడి చుట్టూనే తిరుగుతోందిగానీ.. ఆమె మాత్రం సెట్‌ కావడం లేదు. లేటెస్ట్‌ న్యూస్‌ ప్రకారం టైటిల్‌ రోల్‌ పోషిస్తోందట.

తెలుగు ఇండస్ట్రీ ఈ మధ్య సాయిపల్లవి చుట్టూనే తిరుగుతోంది. అలాగని.. చేతిలో మూడ్నాలుగు సినిమాలు కూడా లేవు. రిలీజ్‌కురెడీగా వున్న లవ్‌స్టోరీతోపాటు.. నాతో జత కడుతున్న ‘శ్యాం సింగరాయ్‌’ సెట్స్‌పై వుంది. మరో మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వకపోయినా.. ప్రతి సినిమాలో ముందుగా ఈ అమ్మడి పేరు బైటకు రావాల్సిందే.

మెగా హీరోలకు చెల్లెలుగా.. హీరోయిన్‌గా సాయిపల్లవి పేరు మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుష్ప మూవీలో బన్నీ చెల్లెలుగా… లూసిఫర్‌లో చిరంజీవి సిస్టర్‌గా ముందు ఈ అమ్మడు పేరే వినిపించింది. నిజమో.. గాసిప్సోగానీ అయ్యప్పనమ్‌ కోషియమ్‌ తెలుగు రీమేక్‌లో పవన్‌ భార్యగా కూడా ఈ హైబ్రీడ్‌ పిల్ల పేరు తెరపైకి వచ్చింది.

ఇలా సాయిపల్లవి పేరు మీడియా తిరిగి మాయమైపోతోంది. లేటెస్ట్ న్యూస్‌ ఏమంటే.. తేజ దర్శకత్వంలో నటిస్తోందట. తేజ ఏడాది క్రితమే.. ‘అలివేలు మంగ వేంకటరమణ’… ‘రాక్షసరాజు.. రావణాసురుడు’ పేరుతో రెండు సినిమాలు ఎనౌన్స్‌ చేశాడు. వేంకటరమణగా గోపీచంద్‌.. రావణాసురుడుగా రానా నటిస్తారని ప్రకటించారు. గోపీచంద్‌ సరసన అలివేలు మంగగా సాయిపల్లవి నటిస్తోందట. ఈరోల్‌ కీర్తిసురేష్‌.. అనుష్క.. కాజల్‌ .. తాప్సి చుట్టి తిరిగి సాయిపల్లవి దగ్గరకు చేరింది. మరి ఇది కూడా ఉత్తుత్తి న్యూసేనా? లేదంటే.. అలివేలు మంగ అవతారం ఎత్తుతుందో చూడాలి మరి.

TOP STORIES

అందరి ముందు మాట్లాడాలంటే భయమా…? అయితే ఇది మీకోసం…!

చాలా మంది కింద చాలా బాగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే చేతులు వణికి పోతాయి. అలానే పేనిక్ అయిపోతుంటారు. ఇది...