సిజేరియన్ చేసే సమయంలో వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లోపల బిడ్డకు ఏ ప్రమాదం లేకుండా ఆపరేషన్ నిర్వహించాలి. ఏ చిన్న తేడా వచ్చినా సరే బిడ్డ ప్రాణాలు పోయే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక చిన్న పొరపాటు కారణంగా ఒక పసికందుకి మొహం మీద కత్తి ఘాటు అయింది.
రష్యాలోని నార్విచ్ యూనివర్శిటీ ఆసుపత్రిలో డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే గర్భంలో ఉన్న శిశువుకు ఆపరేషన్ చేస్తున్న కత్తి తగిలింది. దీనితో బయటకు వచ్చినప్పుడు చూడగా ఆ శిశువు ముఖంపై కత్తిగాటు కాస్త పెద్దదే పడింది. దీనిపై శిశువు తల్లి దర్యా కడోచ్నికోవా కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే డాక్టర్లను ఆమె ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించగా… వైద్యులు వివరణ ఇచ్చారు.
సిజేరియన్ చేసే చేస్తున్న సమయంలో గర్భంలో ఉన్న శిశువు స్థానం ఉందని, అదే విధంగా ఆపరేషన్ జరుగుతున్న సమయంలో శిశివు అసలు కదల్లేదని వివరణ ఇచ్చుకున్నారు. వాస్తవానికి ఆమెకు నార్మల్ డెలివరీ చేయాల్సి ఉండగా శరీరం సహకరించకపోవడం, ఆమెకు జ్వరం కూడా ఉండటంతో సిజేరియన్ చేసామని వైద్యులు వివరించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.