మేడారం జాతరకు వెళ్తున్నారా…? అయితే ఇల్లు గుల్లే…!

-

మేడారం జాతర’ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. తెలంగాణా కుంభమేళాగా పిలుస్తూ ఉంటారు. దేశం నలుమూలల నుంచి కుటుంబ సమేతంగా ఈ జాతరకు వెళ్లి తమ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ సహా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా మేడారం జాతరకు తరలి వస్తూ ఉంటారు భక్తులు. దీనితో ఈ జాతరకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.

అయితే ఇప్పుడు ఈ జాతర కొందరు దొంగలకు అద్రుష్టంగా మారింది. సాధారణంగా హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అనే తేడా లేకుండా ఈ జాతరకు వెళ్తూ ఉంటారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్నారు దొంగలు. జాతరకు వెళ్తున్న వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారి ఇళ్ళను గుర్తిస్తున్నారు. రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్ సహా తెలంగాణాలో ఉండే పలు నగరాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీగా దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలంగాణా పోలీసులు కూడా గుర్తించారు. కాబట్టి ఇళ్ళకు తాళం వేసి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇంట్లో విలువైన వస్తువులు లేకుండా చూసుకోండి. అదే విధంగా పక్కింటి వాళ్లకు కూడా సమాచారం ఇవ్వడంతో పాటుగా జాతరకు వెళ్తే పోలీసులకు చెప్పి వెళ్ళండని పలువురు సూచిస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ సహా అనేక గ్యాంగులు ఇప్పుడు నగరంలో హల్చల్ చేస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా వ్యవహరిస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news