షాకింగ్; పాతికేళ్ళ పాస్తా డబ్బా ఓపెన్ చేసాడు…!

-

లాక్ డౌన్ సమయంలో బోర్ కొడుతున్న నేపధ్యంలో తమ కోసం ఏదొకటి చేసి బిజీ అవ్వాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. ఒక కుటుంబం తమ కోసం పెరటి లో ఏకంగా ఒక బీచ్ ని ఏర్పాటు చేసింది. తాజాగా ఒక వ్యక్తి అమెరికాలో కాస్త వింతగా ఆలోచించాడు. లాక్డౌన్ సమయంలో వినోదానికి గానూ… న్యూయార్క్ కి చెందిన వ్యక్తి వ్యక్తి పాస్తా డబ్బా తెరవాలని నిర్ణయించుకున్నాడు.

అందులో వింత ఏముంది అంటారా…? ఏమి లేదు అది 1995 నుంచి ఓపెన్ చేయలేదు అంతే. ఏంటి షాక్ అవుతున్నారా…? నిజమే మరి. మాట్ అనే వ్యక్తి టాయ్స్, మిఠాయిలు, హాలిడేస్, హర్రర్ సినిమాలు మరియు విచిత్రమైన వంటకాలకు సంబంధించిన డైనోసార్ డ్రాక్యులా అనే వెబ్‌సైట్‌ను నడుపుతున్నాడు. శుక్రవారం, మాట్ 1995 నుండి స్పైడర్ మాన్ పాస్తా ఒకటి ముడతలు పడిపోయిందని దాన్ని తెరుస్తున్నా అని పేర్కొన్నాడు.

“1995 నుండి స్పైడర్ మాన్ పాస్తా యొక్క దారుణంగా పాడైపోయిన డబ్బాను తెరుస్తున్నా అని పేర్కొన్నాడు. ఈ ఫోటోని పోస్ట్ చేసాడు. మాట్ ట్వీట్ 82,000 ‘లైక్‌లు’ మరియు 16,000 పైగా ‘రీట్వీట్‌లను’ పొందింది. తన మాటను నిజం చేస్తూ, ట్విట్టర్ యూజర్ తుప్పుబట్టిన డబ్బాను తెరిచి దాన్ని పరిశీలించాడు. కుళ్ళిపోయిన భాగాన్ని అప్పుడు చూపించాడు. దీన్ని చూసి కొంత మందికి వాంతులు అయ్యాయని కామెంట్ కూడా చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news