బంధం: మీ భాగస్వామికి మీకు దూరం పెరిగిందని తెలిపే సంకేతాలు ఇవే

-

ఇద్దరు వ్యక్తులు బంధంలో ఉన్నప్పుడు చిన్నచిన్న మనస్పర్ధలు రావడం చాలా సహజం. అసలు ఎలాంటి గొడవ లేకుండా బంధం అనేది ఉండదు. అయితే గొడవ జరిగిన తర్వాత మళ్లీ కలిసిపోయి ఎంత త్వరగా మామూలుగా మారిపోతున్నాం అనేది ముఖ్యం.

కొన్ని కొన్ని సార్లు ఎలాంటి గొడవలు రాకుండానే భాగస్వామితో దూరం ఏర్పడుతుంది. దానికి రకరకాల కారణాలు ఉండి ఉంటాయి. ప్రస్తుతం మీ భాగస్వామికీ మీకూ మధ్య దూరం పెరిగిందనడానికి కొన్ని సంకేతాలు అవసరమవుతాయి. అవేంటో చూద్దాం.

డిస్కస్ చేయాలనే ఇంట్రెస్ట్ లేనప్పుడు:

మీ మనసులోని భావాలను భాగస్వామితో చెప్పాలన్న కోరిక కలగనప్పుడు మీకు తనకు దూరం పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అర్థం చేసుకోదని మీకు అనిపించి, పూర్తిగా డిస్కస్ చేయడమే మానేస్తే బాగా దూరం పెరిగినట్టే లెక్క.

డబ్బు విషయంలో తేడాలు:

మీకేమో డబ్బు సేవ్ చేయాలని ఉంటుంది, అవతలి వాళ్లకేమో ఖర్చు చేయాలని ఉంటుంది. మీరు వాళ్ళని సేవ్ చేయాలని ఒప్పించాలి, లేదంటే ఖర్చు చేసేందుకు మీరు సిద్ధపడాలి. ఇద్దరూ తగ్గనప్పుడు వాదన వస్తుంది. ఈ వాదన ఎక్కువైతే మాటలు తగ్గిపోతాయి. దూరం పెరుగుతుంది. కాబట్టి డబ్బుతో జాగ్రత్త.

అవతలి వాళ్ళ ప్రతీ మాటకు మీరు అడ్డు వెళ్తుంటే:

మీ భాగస్వామి ఏది చెప్పినా అది మీకు నచ్చట్లేదంటే.. వాళ్లకు మీకు మధ్య దూరం జరుగుతున్నట్టే లెక్క. వాళ్ల ప్రతి మాటను లెక్కచేయకుండా అడ్డంగా వాదిస్తున్నారంటే.. ఇంకొన్ని రోజుల్లో దూరం మరింత పెరుగుతుందని అర్థం.

ప్రతీసారి అరిస్తే:

వాదన మంచిదే కానీ అది చాలా మామూలుగా ఉండాలి. అరిచినట్టుగా, గోల చేసినట్టుగా అవతలి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా మీరు ప్రవర్తిస్తుంటే.. అవతలి వాళ్ళు మీకు దూరం అయిపోతారు.

స్నేహంగా ఉండలేనప్పుడు:

ఏ బంధమైనా నిలబడాలంటే ప్రేమ ఉండాలంటారు. అది నిజమే. కానీ ఇద్దరు మనుషులు స్నేహంగా ఉండలేనప్పుడు ఆ బంధంలో ప్రేమ ఉండలేదు. మీ ఫ్రెండ్ తో ఎలా ఉంటారో మీ భాగస్వామితో అలా ఉండలేకపోతే.. మీ మధ్య దూరం పెరిగినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news