అమ్మాయి అత్యంత ప్రేమిస్తుందని తెలిపే కొన్ని సంకేతాలు..

-

సాధారణంగా అమ్మాయిలు బయటపడరు. ఏ విషయాన్నైనా మనసులోనే దాచుకుంటారు. ఇక ప్రేమ గురించైతే మరీనూ. అమ్మాయి ప్రేమిస్తుందని తెలిసి, ఆ విషయాన్ని అబ్బాయే చెప్పాలని అనుకుంటారు తప్ప, వారికి వారుగా ప్రేమిస్తున్నామని చెప్పరు. ఐతే అమ్మాయి మిమ్మల్ని అత్యంత ఎక్కువగా ప్రేమిస్తుందని తెలియడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. మీరు ప్రేమిస్తున్న అమ్మాయి, మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తుందో ఈ సంకేతాల ద్వారా తెలుసుకోండి.

మీరంటే ఇష్టపడే అమ్మాయి, మీ దగ్గర నార్మల్ గా ప్రవర్తించదు. అందర్లో ఉన్నప్పుటి కంటే మీతో ఉన్నప్పుడు ఆమె ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. కొంచెం రొమాంటిక్ గా చిలిపి చేష్టలు చేస్తూ కనిపిస్తుంది.

ట్రావెలింగ్ ఇష్టపడుతుంది. మీతో బయటకి వెళ్ళడానికి ఇష్టం ఉంటుంది. ఎక్కడకి వెళ్ళినా మీరు తోడుంటే బాగుండేది కదా అని ఫీల్ అవుతుంది. అందుకే కొన్ని సార్లు మీకు సంబంధం లేని ట్రిప్ లకి కూడా తనతో పాటు తీసుకెళ్తుంది.

మీకోసం వంట వండుతుంది. వంట రాకపోతే నేర్చుకుంటుంది. ఆమె చేతి వంట తినిపించాలని తహతహలాడుతుంది. అది మీరు తింటే సంతృప్తిగా ఫీల్ అవుతుంది. మీకు ఆకలిగా ఉంటే వెంటనే ఏదో ఒకటి తినిపించాలని చూస్తుంది.

మెల్ల మెల్లగా మీ స్థానంలోకి ఆమె వెళ్తుంది. మీకు జరిగే ప్రతీ విషయంలోనూ ఆమె ఉండాలని అనుకుంటుంది. ఆమె, మీరు వేరు వేరు కాదన్నట్టుగా మీ సమస్యలకి పరిష్కారాలు వెతకడం, మీ బాధల్లో పక్కనే ఉండడం, సంతోషంలో పాలు పంచుకోవడం ఇష్టపడుతుంది. మీ జీవితంలో జరిగే గొప్ప గొప్ప సంఘటనలన్నింటిలో తాను భాగం అవ్వాలని అనుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version