మీరు ప్రేమిస్తున్న అబ్బాయి మిమ్మల్ని వదిలి ఉండలేడని చెప్పడానికి గల సంకేతాలు..

Join Our Community
follow manalokam on social media

అమ్మాయిలకి పెళ్ళనగానే చాలా కలలుంటాయి. అప్పటి వరకూ ఒకలా నడుస్తున్న జీవితం ప్రేమించిన వారితో కొత్తగా మారుతుంది కాబట్టి, కొత్త ప్రపంచాన్ని ఊహిస్తారు. తాము ప్రేమిస్తున్న అబ్బాయి తమ కోసం ఏదైనా చేస్తాడని నమ్ముతారు. జీవితాంతం తనకి తోడుగా ఉంటారని, ఉండాలని అనుకుంటారు. మీరు ప్రేమిస్తున్న అబ్బాయి మిమ్మల్ని వదిలి ఉండలేడని చెప్పడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. మీరు ప్రేమిస్తున్న అబ్బాయిలో ఈ లక్షణాలు కనిపిస్తే మీరు అదృష్టవంతులే అన్నమాట.

మీ చుట్టూ జీవితం నిర్మించుకుంటాడు.

జీవితంలో జరగబోయే ప్రతీ విషయంలో మిమ్మల్ని ఊహించుకుంటూ, దానికి తగినట్లుగా వారి జీవితాన్ని మార్చుకుంటారు. మీకు ఇబ్బంది కలిగించకుండా మీ చుట్టూ తన జీవితాన్ని నిర్మించుకుంటాడు.

నేను అనేకన్నా మనం అని ఎక్కువ వాడతారు

మనం అన్న పదం తరచూ అతని నోటి నుండి వినిపిస్తూ ఉంటుంది. అతని ఆలోచనల్లో దేని గురించి ఆలోచించినా మీరు కనిపిస్తారు కాబట్టే, మనం అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఏ పని చేసినా మీ ఇద్దరినీ దృష్టిలో ఉంచుకునే ఆలోచిస్తారు. ముందడుగు వేస్తారు.

పరిస్థితులు కఠినంగా మారినా మీ పక్కనే ఉంటాడు

సంతోషంగా ఉన్న సమయంలోనే కాదు, బాధల్లోనూ పాలు పంచుకుంటాడు. మీ బాధలని తగ్గించేందుకు ప్రయత్నిస్తాడు.

ఇద్దరు కలిసి షాపింగ్ కి వెళ్తారు

తనకోసం ఏదైనా కొనాలనుకున్న మిమ్మల్ని షాపింగ్ కి తీసుకెళతాడు. వాళ్ళింట్లో వాళ్ళకి ఏది కొందామనుకున్నా మిమ్మల్ని తోడుగా తీసుకెళ్తాడు.

వారి కుటుంబంలో భాగంగా చూస్తారు

మీరు వేరు అతని కుటుంబం వేరని చూడరు. మీరు కూడా అతని కుటుంబంలో భాగమే అనుకుంటారు. మీ కుటుంబంలో తాను కూడా ఒకడిగా అవడానికి చూస్తాడు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...