రిలేషన్ షిప్: సెక్స్ లేని స్నేహాన్ని కోరుకుంటున్న సింగిల్ ఇండియన్లు.. తాజా సర్వే.

-

ప్రతీ ఒక్కరూ రిలేషన్ షిప్ లోకి రావాలని అనుకుంటారు. మహమ్మారి వచ్చిన తర్వాత ఇది మరింతగా ఎక్కువైంది. అందుకే ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ కి గిరాకీ పెరిగింది. చాలామంది భారతీయులు ఆన్ లైన్ స్నేహాల వైపు మొగ్గు చూపుతున్నారు. తాజా సర్వే ప్రకారం సింగిల్ గా ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఆన్ లైన్ స్నేహాల వైపు ఎక్కువగా చూస్తున్నారని, అది కూడా సెక్స్ అన్న అంశం లేకుండా తమ స్నేహాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నారని బంబుల్ యాప్ వెల్లడి చేసింది.

మహమ్మారి వల్ల భౌతికంగా కలవడం ఇబ్బంది ఉన్నందున, వర్చువల్ గా కనెక్ట్ అవుతున్నారు. ఇలా ఆన్న్ లైన్ స్నేహాల్లో కనెక్ట్ అవుతున్నవారిలో ఎక్కువ శాతం చెన్నై ప్రాంతానికి చెందిన వారున్నారని, 32శాతం మంది చెన్నై నుండే ఉన్నారని బంబుల్ చెబుతుంది. ఇంకా, 30శాతం మందితో అటు ముంబై, ఇటు హైదరాబాద్ రెండవ స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకుముందుతో పోలిస్తే ప్రస్తుతం ఈ ట్రెండ్ జోరుగా సాగుతుందని, అదీగాక చాలా సాధరణం అయిపోయిందని అంటున్నారు.

కఠిన పరిస్థితుల్లో పక్కన తోడుగా ఎవరైనా ఉండాలని అందరూ భావిస్తారు. ప్రస్తుతం అది కష్టంగా మారింది కాబట్టి ఆన్ లైన్ స్నేహాల్లో స్వాంతన పొందుతున్నారు. గతంలోలా బయటకి వెళ్ళి కొత్త ఫ్రెండ్స్ ని కలుసుకోవడం, కొత్తవాళ్ళని స్నేహితులుగా మార్చుకోవడం కష్టమైన పని. ఈ కరోనా ఇంకా ఎన్నిరోజులు ఉంటుందో తెలియదు. కాబట్టి తమలాంటి, తమకు నచ్చే అభిప్రాయాలున్న వారిని కలుసుకునేందుకు మక్కువ చూపించడం ఆన్ లైన్ లో సులభంగా జరిగిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version